ఆంధ్రప్రదేశ్‌

ఉద్దానంలో పంట నష్టం అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 16: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు కుదేలయ్యారు. జిల్లాలోని 38 మండలాల్లో 6.50 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వరి వేశారు. నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ, తోటపల్లి, మడ్డువలస ప్రాంతాల్లో వరి పంట అధిక దిగుబడి వచ్చిందన్న ఆనందాన్ని ఉద్దానంలోనే 1.28 లక్షల ఎకరాల్లో వరి నీటమునిగి, నేలకొరిగి నాశనమైపోయింది. ఒడిశాలో వాయుగుండం గురువారం తీరం ఆ ప్రభావంతో ఉద్దానం ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వరి నేలకొరిగి నీటిమునిగింది. మొత్తానికి జిల్లాలో ఖరీఫ్, రబీ పంటలకు నష్టం వాటిల్లి అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీసింది. మొత్తంగా లక్షా 28 వేల ఎకరాల కోసిన పంటతోపాటు, చేలు పంటభూముల్లోనే నీటిమునిగి ఉండడంతో రంగుమారిపోవడం, మొలకెత్తనుండడంతో ఎందుకూ పనికి రాకుండా ధాన్యం పంట పోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కవిటి, కంచిలి, సోంపేట, మందస, ఇచ్చాపురం మండలాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో లక్షకుపైగా ఎకరాల్లో పంటపొలాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 245 సె.మీ. వర్షపాతం నమోదుకాగా, సరాసరి 6.4 సె.మీ. వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా కంచిలిలో 22 సె.మీ. వర్షపాతం నమోదు కాగా, కవిటి మండలంలో 19, సోంపేటలో 18, ఇచ్చాపురంలో 17, మందసలో 14 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వరి పంట కోశాక మినుము, పెసర విత్తనాలు కూడా వేసారు. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా వంటి నదులలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ఆయా నదీ తీరప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు. ఇదిలా ఉండగా మందసలో మూడు, ఎచ్చెర్ల మండలం కొంగరాంలో ఒక గృహం భారీ వర్షాలకు నేలమట్టమయ్యాయి.