ఆంధ్రప్రదేశ్‌

భారమా? అనుకూలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 17: అమరావతి నిర్మాణాలపై సుదీర్ఘకాలం నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) లో ఉన్న కేసుపై ఎట్టకేలకు తుది తీర్పు వచ్చింది. అయితే, అందులో ట్రైబ్యునల్ విధించిన షరతులు, కమిటీల పర్యవేక్షణ, నివేదికల వ్యవహారం ప్రభుత్వానికి సానుకూలమా? వ్యతిరేకమా? అన్న చర్చకు తెరలేచింది. దానికంటే ముందు.. ఇకపై రాజధాని నిర్మాణాలన్నీ ఎన్జీటీ కనుసన్నలలోనే జరగనుందన్న విషయం మాత్రం తాజా తీర్పు స్పష్టం చేసినట్టయింది. రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ ఐఏఎస్ అధికారి శర్మ, శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశమయింది. ప్రతి నెల సమీక్ష, ఆరునెలలలకో నివేదిక, పర్యావరణ పరిరక్షణకు సూపర్‌వైజర్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ షరతులు విధించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా పర్యవేక్షణ కమిటీలో ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. నదీ, వరద జలాల మార్పాలజీలో ఎలాంటి మార్పు చేర్పులుండకూడదన్న షరతు ఇబ్బందికరమేనంటున్నారు. ప్రధానంగా కొండవీటి వాగు వ్యవహారంలో ఎన్‌జీటీ తీర్పు రాష్ట్ర ప్రభుత్వ భూసమీకరణకు అవరోధమేనంటున్నారు. ఎలాంటి పరిస్థితిలోనూ కరకట్టలను మార్పు చేయవద్దనడం కూడా సర్కారుకు శరాఘాతమేనని చెబుతున్నారు. ‘కొండవీటి వాగు దిశను మార్చవద్దనడం వల్ల 15 వేల ఎకరాలకు ముప్పు తప్పింది. రెండు కమిటీల నియామకంతో ఇకపై ప్రభుత్వ ఇష్టారాజ్యం కుదరద’న్న విషయం స్పష్టమయిందని పిటిషనర్ శ్రీమన్నారాయణ వ్యాఖ్యానించారు. ఇది ఒకరకంగా నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడి తప్పకుండా పరోక్షంగా నడిపించడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొండవీటి వాగును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వానికి తాజా ఎన్జీటీ తీర్పు ఇబ్బందికరమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇకపై బాబు తన నివాసాన్ని ఖాళీ చేయాలన్న డిమాండ్ ఊపందుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘తాజా తీర్పుతోనయినా బాబు తన ఇంటిని ఖాళీ చేసి కృష్ణానదీ పరిరక్షణకు స్ఫూర్తినిస్తే బాగుంటుంది. కొండవీటి వాగును తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న కుట్రను ఎన్జీటీ బ్రేక్ వేయడం శుభ పరిణామ’మని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, ఇది తమకు సానుకూలమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో రాజధాని నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులను ఎన్టీటీ ఇచ్చిందన్నారు. ఇది శుభపరిణామనన్నారు. పర్యావరణ అనుమతుల కోసం డీపీఆర్ రూపకల్పనకు సంబంధించి కొన్ని పరిమితులు విధించిందని, వాటిని పాటిస్తామని ప్రకటించారు.