ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో హరిత రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో హరిత రహదారుల నిర్మాణానికి సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 7 ఎక్స్‌ప్రెస్ రేడియల్ రహదారులు హరిత రహదారులుగా రూపుదిద్దుకొంటున్నాయి. అమరావతికి హరిత హారంగా వీటిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతి రహదారులను కేవలం ప్రయాణ సదుపాయంగానే కాకుండా ఆహ్లాదకరమైన వాతావణాన్ని కల్పించడంతోపాటు వాతావరణ కాలుష్య నివారణకు అనుకూలమైన రహదారులుగా తీర్చిదిద్దనున్న నేపథ్యంలో భారీ ఎత్తును మొక్కలే నాటే కార్యక్రమం చేపట్టారు. మందడం గ్రామం మీదుగా వెళ్తున్న యాక్సెస్ రోడ్డు (ఈ-3) కి ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా వేలాది మంది విద్యార్థులతో వేలాది మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.