కృష్ణ

అనుమతించిన రీచ్‌లలోనే ఇసుక తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అనుమతించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలో ఉచిత నూతన ఇసుక విధానం అమలుపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ మంగళవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోను అమలుచేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టటం చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అనుమతించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలను నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో నదీ తీర ప్రాంతంలోని పెనమలూరు మండలం పెదపులిపాక, కంకిపాడు మండలం మద్దూరు రీచ్‌లు, పూడికతీత విధానం ద్వారా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌లోని భవానీపురం, సూరాయిపాలెం, గుంటుపల్లి, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం రీచ్‌లలో మాత్రమే ప్రజలు ఉచితంగా ఇసుక తవ్వి రవాణా చేసుకుని వినియోగించుకునేందుకు అనుమతించబడిందని కలెక్టర్ తెలిపారు. ఉచిత ఇసుక వినియోగం స్థానిక నిర్మాణాలకు మాత్రమే వీటిని వినియోగించాలని కలెక్టర్ సూచించారు. అనుమతించిన ఇసుక రీచ్‌లలో ఒక్కొక్క రీచ్‌కు టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసి బాధ్యత తీసుకోవలసి ఉంటుందని కలెక్టర్ సూచించారు. అనుమతించిన ఇసుక రీచ్‌లలో ఒక్కొక్క రీచ్‌కు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి బాధ్యత తీసుకోవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కొత్త పాలసీలో అధికారులు సమష్టిగా దృష్టి పెట్టవలసి ఉంటుందన్నారు. గత పాలసీలో ఇసుక అమ్మకాలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని, దీనిలో ఎక్కువ భాగం మన జిల్లా నుండే రావటం జరిగేదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకొని ప్రజలకు, నిర్మాణ రంగానికి ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, ఆదేశాలను అధికారులందరూ పాటించాలని కలెక్టర్ తెలిపారు. సామాన్య ప్రజానీకం తమ గృహాలకు అవసరమైన చిన్న, చిన్న నిర్మాణాలు, మరుగుదొడ్లు వంటి వాటిని తక్కువ ఖర్చుతో నిర్మించుకునే అవకాశం ఉచిత ఇసుక ద్వారా లభించటం జరుగుతుందన్నారు. అనుమతించిన ఇసుక రీచ్‌లలో ఇసుకను కేవలం జిల్లాకు మాత్రమే పరిమితం చేసుకోవాలని, ఇతర రాష్ట్రాలకు తరలించినా, అనధికారికంగా నిల్వచేసినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సొంత భవన నిర్మాణాలకు మాత్రమే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అమ్మకాలు నిర్వహించరాదని, అనుమతించిన ఇసుక రీచ్‌లలో కాకుండా అనధికారికంగా తవ్వకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద ఇక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా కట్టుదిట్టమైన నిఘా వుండాలని అధికారులను కలెక్టర్ కోరారు. నియమ నిబంధనలు ఉల్లంఘించినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు లక్ష రూపాయలు జరిమానా, రెండు సంవత్సరాలు వరకు జైలుశిక్షతో పాటు వాహనాలు, యంత్రాలు స్వాధీనం చేసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘన పునరావృతం అయితే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేయటం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఉచిత ఇసుక తవ్వకాల పర్యవేక్షణకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పోలీస్, జలవనరుల శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, గ్రౌండ్ వాటర్, డిఆర్‌డిఎ, మైన్స్ అండ్ జుయాలజీ, ఆర్ అండ్ బి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, డ్వామా శాఖలకు చెందిన జిల్లాస్థాయి నుండి మండల స్థాయి అధికారులు టాస్క్ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గాను, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్‌డివోలు, మండల స్థాయిలో తహశీల్దార్ టాస్క్ఫోర్స్ కమిటీకి చైర్మన్లుగా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్లు జి.సృజన, లక్ష్మషా, అసిస్టెంట్ కలెక్టర్ సలోని, ఆర్‌డివోలు పి.సాయిబాబా, ఎం.చక్రపాణి, మైన్స్ జియాలజీ అసిస్టెంట్ డైరక్టర్లు కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు, వైఎస్ బాబు, డ్వామా పిడి పి.మాధవీలత, ఇరిగేషన్ ఎస్‌ఇ సి.రామకృష్ణ పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం ప్రధాన ద్వారానికి తాళం వేసిన దృశ్యం

దుర్గగుడి మూసివేత

ఇంద్రకీలాద్రి: సంపూర్ణ సూర్య గ్రహణం కారణంగా మంగళవారం రాత్రి 8 గంటలకు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి సన్నిధితోపాటు అన్ని ఉపాయాలను సైతం ఆలయ సిబ్బంది మూసేశారు. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 7-30 గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు తలుపులు తెరచి అమ్మవార్లకు స్నపనాభిషేకం, సంప్రోక్షణ, విశేష అర్చనలు, నివేదిన, తదితర వాటిని నిర్వహించిన తర్వాత శ్రీ దుర్గా మల్లేశ్వరస్వా దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం 12-30 గంటల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి అనుమతించటం జరుగుతోందిన సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు తెలిపారు.