ఆంధ్రప్రదేశ్‌

2020 నాటికి ఏపి అగ్రగామి: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజన్ 2020 డాక్యుమెంట్ కింద అభివృద్ధిచేసి అతి త్వరలో దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విభజన నష్టాలను, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చి, పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్పతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్న యనమల మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ముందు దేశంలో అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండేదని, ఇప్పుడు విభజన కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఒక్క జిడిపి మినహా మిగతా అన్ని అంశాల్లో విభజనతో వెనుకబడ్డామని, మళ్లీ అన్ని రంగాల్లో ప్రభుత్వాన్ని ముందుకుతీసుకువెళ్లడానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు. విభజన నష్టాలు, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనడం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకోవల్సి ఉందన్నారు.