ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 17: కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏపి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం సమితి జిల్లా అధ్యక్షుడు పివి మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ హోదా కోట్లాది ఆంధ్రుల ఆకాంక్ష అని, గత మూడు సంవత్సరాల నుండి హోదా కోసం పోరాడుతున్నామన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 18 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌కు 25 శాతం నిధులు కేటాయించి ఏపీకి మాత్రం 71 కోట్లు కేటాయించడంలోనే కేంద్రానికి రాష్ట్రంపై ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ హోదా ముగిసిన అధ్యాయమంటూ కొందరు ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో కూడా కేంద్రం జాప్యం చేస్తోందన్నారు. ఇటు ఏపీకి హోదా ఇవ్వకుండా, ఇప్పటికే హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు మరో పదేళ్ల పాటు పొడిగించడంతో పాటు 27,400 కోట్ల రూపాయలు జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు. ఈనెల 20వ తేదీన జరుప తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థల నిర్మాణంలో కేవలం మొండి గోడలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్‌కు నిధుల కేటాయింపులో కూడా రాష్ట్రానికి కేవలం 9 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. జనసేన నాయకులు లండన్ సతీష్ మాట్లాడుతూ ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన పాలకులపై ఉందన్నారు.
జీఎస్‌టీ వల్ల ప్రజలే కాకుండా వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా లేకున్నా భారం కాకూడదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు ఎ హరి, అవగాహన సంస్థ సహాయ కార్యదర్శి అచ్యుత ఇందుశేఖర్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ