ఆంధ్రప్రదేశ్‌

వారిద్దరూ డూప్లికేట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: కాఫర్ డ్యామ్‌పై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడం తగదని రోడ్లు, రహదారుల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. విశాఖ నగరంలో ఏపీఐఐసి ప్రాంగణంలో శుక్రవారం ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017 ముగింపు సందర్భంగా మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిద్దరూ బీజేపీలో కొత్తగా చేరిన డూప్లికేట్ నేతలుగా అభివర్ణించారు. ఒరిజనల్ బీజేపీ నేతలు దీని గురించి మాట్లాడితే అర్ధం ఉండేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి అని, ఆ తరువాత బీజేపీలోకి వచ్చారన్నారు. ఈ ప్రాజెక్టుపై తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా చేతనైతే ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బురదజల్లడం తగదన్నారు. పార్టీలకతీతంగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించాల్సింది పోయి తెలుగువారే అడ్డుకునే దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. అక్టోబర్ 3న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ టెక్నికల్ టీమ్ పోలవరం డ్యామ్‌ను తనిఖీ చేసిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. రాబోయే తరానికి దీని వలన ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అయితే కొంతమంది లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తన తాత ఎమ్మెల్యేగా ఉన్నపుడు పోలవరం గురించి మాట్లాడేవారని, అటువంటిది అప్పటి వారేవరూ లేరన్నారు. ఉపాధి హామీ పథకం కింద 13వేల గ్రామాల్లో 13,600 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రధాని నుంచి తాను 13 అవార్డులు తీసుకున్నానన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు కెవిపి రామచంద్రరావు, సుబ్బారెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు. రాజధాని నిర్మాణం చేయాలని ఆమోదిస్తే దీనిని సైతం అడ్డుకునేందుకు గోదావరి, కృష్ణా నదులు కాలుష్యం అవుతాయంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం దురదృష్టకరమన్నారు. అయినా కోర్టు దీని నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదంటూ తీర్పు చెప్పడం హర్షణీయమన్నారు.