ఆంధ్రప్రదేశ్‌

నంది అవార్డులను పునఃసమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, నవంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సంబంధిత కమిటీ పునఃసమీక్షించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత దశాబ్ధకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులు ప్రజాదరణ పొందిన వారికి, కమిటీ ఎంపిక చేసిన వారికే ఇస్తుండేవారన్నారు. అయితే తాజాగా నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. నచ్చిన సినీతారలకు అవార్డులు ఇవ్వడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. గతంలో ప్రజాదరణ పొందిన సినిమాలు తీసిన, నటించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లకు అవార్డులు ఇచ్చేవారన్నారు, అవి కూడా పారదర్శకంగా ఉండటంతో ఎలాంటి విమర్శలు వచ్చేవి కావన్నారు. తొలిసారిగా అధికారపక్షం జోక్యం చేసుకుని అర్హత లేని వారికి, సందేశాత్మకంగా లేని సినిమాలకు అవార్డులు ప్రకటించడంతో తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం, నంది అవార్డుల కమిటీ పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేకుంటే అవార్డులకు విలువ లేకుండా పోతుందన్నారు. అంతేగాక అవార్డులు పొందిన సినిమాలు ప్రజాదరణ కోల్పోతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సామూహికంగా పట్టిసీమ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళడం ద్వారా రైతులకు ఒరిగిందేమి లేదని రఘువీరా అన్నారు.