ఆంధ్రప్రదేశ్‌

ఇది శుభ పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: రాజధాని అమరావతి నిర్మించే 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో పర్యావరణ అంశాలకు సంబంధించి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతులను ఇచ్చిందని, రాష్ట్రానికి ఇది శుభ పరిణామమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల్లో భాగంగా రెండు కమిటీలను వేయాలని ఎన్‌జీటీ సూచించిందన్నారు. వీటిలో సూపర్‌వైజింగ్ కమిటీ ప్రతి ఆరు నెలలకు, అమలుచేసే కమిటీ ప్రతి నెలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించిందన్నారు. ట్రిబ్యునల్‌కు ప్రతి ఆరు నెలలకు నివేదికను సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం డీపీఆర్ రూపొందించి దానిలో కొన్ని పరిమితులను విధించిందన్నారు. పరిమితులను తప్పకుండా పాటించాలన్నారు. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో చెరువులు, కాలువలు ఉంటే వాటి నుంచి ఎంత పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నామో, అక్కడ పక్షులు, ప్రకృతి పరమైన వాటి వివరాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికకు లోబడి పర్యావరణ అనుమతులను ఇచ్చారన్నారు. ఎన్‌జీటీ సూచించిన కమిటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పర్యావరణ రంగంలోని నిష్ణాతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యావరణ శాఖ అధికారులతో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని రాకుండా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి కొందరు కేసులు వేశారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన నాలుగు కేసులకు సంబంధించి తీర్పు ఇచ్చిందన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుక్రవారం ఇక్కడకు వచ్చారన్నారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో 1691 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం 58:42 నిష్పత్తిలో అభివృద్ధి చేస్తామన్నారు. 1691 ఎకరాల్లో లేఅవుట్‌లను చేసి వౌలిక వసతులను కల్పిస్తామన్నారు. రోడ్లు, సివరేజ్, తాగునీరు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అమ్ముతామన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు, సంస్థలు, కంపెనీలు రావడంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి హైపర్ కమిటీ సమావేశమై న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో సమీక్షించి అన్ని విధాల చర్యలను తీసుకుంటుందన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆఫీసును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్నారు. 8 నుంచి 9 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాలను సింగపూర్ ప్రభుత్వం చేపట్టడంలో డిజైన్లను రూపొందిస్తున్నామన్నారు. ఈరోజు రెండు శుభ పరిణామాలు చోటుచేసుకున్నాయని, పర్యావరణ అనుమతుల అంశం, సింగపూర్ ప్రభుత్వంతో సీడ్ క్యాపిటల్ నిర్మాణం డిజైన్ల అంశంగా పేర్కొన్నారు. సీడ్ క్యాపిటల్ రహదారులకు సంబంధించి 75 శాతం టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వర్షాల వలన పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగిందని, మరో 10 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. లేఅవుట్స్‌కు సంబంధించి 3 సంవత్సరాలు పడుతుందని, అవి అన్నీ సిమెంట్ రోడ్ల నిర్మాణాలు అవ్వడం వల్ల అంత సమయం పడుతుందన్నారు.