ఆంధ్రప్రదేశ్‌

ఆ మూడు వరాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మూడు రంగాల్లో తమకు సహకరించాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఇక్కడ శుక్రవారం జరిగిన ‘ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017’ ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ- ‘నేను మిమ్మల్ని డబ్బులు అడగను.. ఏపీలో వ్యవసాయ రంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా సాంకేతిక సహకారాన్ని అందించండి.. పోలియా నివారణకు కృషి చేస్తున్నట్టే పౌష్టికాహార సమస్యను అంతమొందించడానికి చేయూతనివ్వండి.. మా రాష్ట్రంలో పెద్దఎత్తున మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించండి..’ అని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం పారిశుద్ధ్యం మెరుగుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తోందని, దానికి తాను చైర్మన్‌గా ఉంటానని, గౌరవాధ్యక్షులుగా మీరు ఉండండి అని చంద్రబాబు బిల్‌గేట్స్‌ను కోరారు. ప్రపంచంలో ఎంతోమంది సంపన్నులున్నా ప్రజల కోసం ఖర్చు చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారని, అందులో బిల్‌గేట్స్ ముందున్నారని, ఆయన ఒక మానవతావాది అని చంద్రబాబు కీర్తించారు. రాష్ట్రంలో వ్యవసాయం దుర్భర పరిస్థితిలో ఉందని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, ఈ రంగానికి జవసత్వాలు నింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. నదుల అనుసంధానం ద్వారా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చానని వివరించారు. డిజిటల్ ప్రిడెక్టివ్ మ్యాపింగ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన చెప్పారు. 2021 నాటికి ఐదు లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం కిందకు తీసుకువచ్చి, ఉద్యానవన పంటల వైపు వారిని మళ్లిస్తామన్నారు.

చిత్రం..బిల్‌గేట్స్‌తో సంభాషిస్తున్న చంద్రబాబు