ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఏటా పర్యాటక పాలసీ సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైతే ప్రతి ఏటా పాలసీని సవరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ఎడీటీఓఐ) విశాఖ కనె్వన్షన్ విశాఖ నగరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకావకాశాలు అనుకూలంగా మలచుకుంటూ, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఇస్తే పాలసీ అంశంపై పునర్నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించడంలో పర్యాటకం కూడా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల తరువాత అత్యధికంగా ఉపాధి లభించేంది పర్యాటక రంగంలోనేనన్నారు. స్వదేశీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పరంగా పర్యాటకాభివృద్ధికి కీలక ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సంబంధించి 145 ప్రాజెక్టులు రూ.10,300 కోట్లతో ప్రభుత్వ ప్రైవేటు విధానంలో చేపట్టేందుకు ఎంఓయులు కుదుర్చుకున్నామన్నారు. వీటిలో ఇప్పటికే 50 శాతం ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయన్నారు. పర్యాటక ప్రాజెక్టులతో పాటు వాటికి సంబందించి వౌలిక సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సువిశాల తీర ప్రాంతం కలిగిన నవ్యాంధ్రలో తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. అలాగే జీవనదులతో అలరారే రాష్ట్రంలో రివర్ టూరిజం, రాష్టవ్య్రాప్తంగా ఉన్న బౌద్దారామాలతో బుద్దిస్ట్ సర్కిల్, ప్రాచీన దేవాలయాలను కలుపుతూ స్పిరిట్యువల్ టూరిజం, హెల్త్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్య తరగతి పర్యాటకులను ప్రోత్సహించేలా టూర్ ఆపరేటర్లు తమ సేవలను విస్తరించాలన్నారు.ఏడీటీఓఐ జాతీయ అధ్యక్షుడు పిపి ఖన్నా ఆతిథ్య రంగానికి సంబంధించి జీఎస్టీ ఎక్కువగా ఉందని, దీనివల్ల పర్యాటకులపై అదనపు భారం మోపాల్సి వస్తోందన్నారు. దీనిపై సిఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆతిథ్య రంగానికి జీఎస్టీ ఉపశమనం కోరుతూకౌన్సిల్‌కు ప్రభుత్వం తరపున లేఖ రాస్తామన్నారు.

చిత్రం..టూర్ ఆపరేటర్స్ మాన్యువల్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు