ఆంధ్రప్రదేశ్‌

బీడీఎస్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభ్వుం వివిధ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీడీఎస్ చదివిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ప్రాక్టీసు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆయుష్ వైద్యులను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో అల్లోపతి ప్రాక్టీసు చేసేందుకు అనుమతించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొన్ని వర్గాల నుంచి ఈ అంశంపై వ్యతిరేకత వస్తున్నప్పటికీ, కేంద్రం దీనిపై ముందుకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకూ బీడీఎస్ చదివిన వారు దంత వైద్యులుగా మాత్రమే ప్రాక్టీసు చేస్తున్నారు. వీరు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారి మాదిరిగా ఫిజీషియన్లుగా ప్రాక్టీసు చేసేందుకు వీలు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉండటంతో గత ఏడాది డెంటర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. బీడీఎస్ ఉత్తీర్ణులైన వారికి ఒక బ్రిడ్జి కోర్సును నిర్వహించడం ద్వారా ఎంబీబీఎస్ వైద్యులుగా సేవలు అందించే వీలు ఉంటుందని ఆ ప్రతిపాదనలో పేర్కొంది. దీని వల్ల నియామకాలు లేక ఇబ్బందులు పడుతున్న బీడీఎస్ ఉత్తీర్ణులకు ఉపాధితో పాటు గ్రామాల్లో ఎంబీబీఎస్ వైద్య సేవల కొరత తీరుతుందని ప్రతిపాదించింది. డీసీఐ అందచేసిన ప్రతిపాదనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( ఎంసీఐ)కు కేంద్ర ప్రభుత్వం పంపింది. డీసీఐ ప్రతిపాదనపై ఎంసీఐ సానుకూలంగా స్పందించడంతో, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసి, నివేదిక అందచేసేందుకు వీలుగా నిపుణులతో ఒక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కమిటీ వివిధ అంశాలపై కసరత్తు చేస్తోంది. మూడు సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సును కుదించి, బ్రిడ్జి కోర్సుగా మార్చే అంశాన్ని కమిటీ పరిశీలిస్తోంది. ఇతర సాంకేతిక అంశాలను కూడా పరిశీలిస్తోంది. బ్రిడ్జి కోర్సు నిర్వహణ, కోర్సు పూర్తి అయ్యాక ఎంసీఐ గుర్తింపు వంటి అంశాలపై కూడా కమిటీ దృష్టి సారించింది. డిసెంబర్ ఆఖరు నాటికి ఈ నివేదిక అందచేసేందుకు కమిటీ రంగం సిద్ధం చేస్తోంది. ఆయుష్ వైద్యులను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో అల్లోపతి ప్రాక్టీస్ చేసే అంశం కూడా కేంద్ర పరిశీలిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్ వైద్యులు అల్లోపతి ప్రాక్టీసు చేస్తుండటం గమనార్హం. కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదనపై ముందుకు వెళ్లేందుకు కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.