ఆంధ్రప్రదేశ్‌

గొంతు నుండి దూసుకుపోయిన ఇనుప ఊచ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 18: ప్రమాదవశాత్తు ఇనుప ఊచలపై పడిన ఓ వ్యక్తి గొంతు నుండి వెనుకకు ఊచ దూసుకుపోయింది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మురమళ్ల గ్రామానికి చెందిన రాయపూడి సురేష్ (35) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యా హ్నం తన ఆటోలో ప్రయాణీకులను తీసుకువెళ్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి సమీపంలో నిర్మాణంలో ఉన్న డ్రెయిన్ వైపు దూసుకుపోయింది. ఆ సమయంలో డ్రెయిన్ నిర్మాణం కోసం కార్మికులు ఇనుప ఊచలను సిద్ధం చేసి ఉంచగా డ్రైవర్ సురేష్ ప్రమాదవశాత్తు ఆ ఊచలపై పడ్డాడు. దీంతో పదునైన ఓ ఊచ అతని గొంతు నుండి వెనుకకు దూసుకుపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సురేష్‌ను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు సురేష్‌ను పరీక్షించి అత్యవసరంగా శస్తచ్రికిత్స చేస్తున్నారు. బాధితుడికి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై మురమళ్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.