ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ నేతపై అత్యాచారం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 18: పదవుల ఆశ చూపి ఓ మహిళను లొంగదీసుకుని, లక్షల్లో మోసగించిన కేసులో వైకాపా నేత, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పార్టీలోని ముఖ్య నేతలందరి దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆమె కొద్దిరోజుల క్రితం నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. సీపీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన విజయవాడ పటమట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పటమట ఇన్‌ఛార్జి సీఐ దామోదర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. ప్రస్తుతం పటమట డొంకరోడ్డులో నివాసముంటున్న సదరు మహిళ (40) గతంలో గొల్లపూడిలో ఉండేవారు. వైసీపీలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. కాగా జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన సీనియర్ నేత తన్నీరు నాగేశ్వరరావు(45)తో పరిచయం ఏర్పడింది. అధిష్టానంతో మాట్లాడి పార్టీలో కీలక పోస్టు ఇప్పిస్తానని చెప్పి ఆమె ను ప్రలోభాలకు గురి చేశాడు. సుమారు గత 20రోజులుగా మహిళను తన వెంట తిప్పుకుంటూ పదవి ఆశ చూపి శారీరకంగా కూడా లోబరుచుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక.. దశలవారీగా తన వద్ద నుంచి సుమారు 40లక్షల వరకు డబ్బు కాజేసి మోసం చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు వాపోయింది. తన్నీరు నాగేశ్వరరావు తనను మోసం చేసినట్లు గ్రహించిన బాధితురాలు న్యాయం కోసం జగ్గయ్యపేట వైసీపీ ముఖ్యనేత సామినేని ఉదయభాను, జిల్లా నాయకుడు పార్థసారధిలను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోనందున ఈ విషయాన్ని ఎమ్మె ల్యే రోజా, ఎంపీ విజయసాయిరెడ్డిలతోపాటు పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు పోలీసు కమిషనర్ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీపి ఆదేశాలతో పటమట పోలీసులు క్రైం నెంబర్ 761/2017, సెక్షన్ 376(2),(ఎన్), 420, 384, 506 ఐపిసి కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు సిఐ తెలిపారు.