ఆంధ్రప్రదేశ్‌

సినీ ఫక్కీలో ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 18: శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను లారీలో అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు సాహసోపేతంగా వెంటాడి పట్టుకున్న సంఘటన శనివారం ఉదయం జరిగింది. పట్టుబడ్డ లారీలో 82 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. లారీ యజమాని, డ్రైవర్ అయిన తమిళనాడుకు చెందిన శంకర్‌ను, మరో కీలక స్మగ్లర్‌గా భావిస్తున్న శివాజీని అరెస్టు చేశారు. ఏర్పేడు-శ్రీకాళహస్తి నుంచి ఉప్పరపల్లి-మల్లంగుంట పాత చెక్‌పోస్టు మార్గంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలతో లారీ వస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్‌కు సమాచారం అందింది. ఈ క్రమంలో చెక్‌పోస్టు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎర్రచందనం దుంగలను ఎగుమతి చేస్తున్న ప్రాంతానికి అశోక్‌కుమార్ బృందం చేరుకుంది. అయితే అప్పటికే లారీ అక్కడ నుంచి బయలుదేరడం గుర్తించిన టాస్క్ఫోర్స్ సిబ్బంది మరో వాహనంలో వెంబడించారు. దీనిని గమనించిన లారీ డ్రైవర్ శంకర్ మరో మార్గంలోకి వాహనాన్ని మళ్ళించాడు. అయితే టాస్క్ఫోర్స్ పోలీసులు సైతం ఆ లారీని వెంబడించారు. అదే సమయంలో టాస్క్ఫోర్స్‌కు చెందిన మరో బృందానికి సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయడంతో వారు ఎర్రచందనం దుంగలతో వెళుతున్న లారీ వెళ్లే మార్గాన్ని దిగ్బంధనం చేశారు. దీనిని గమనించిన స్మగ్లర్లు లారీని వదలి అడవిలోకి పారిపోయారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని వెంటాడుతున్న సమయంలో శంకర్ తన వద్ద ఉన్న కత్తితో వారిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మెరుపుదాడి చేసి అతడిని పట్టుకున్నారు. ఈసందర్భంగా ఎస్‌ఐ అశోక్ మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం 80 మంది స్మగ్లర్లు శేషాచలం అడవిలోని కాకులమాను వద్ద ఎర్రచందనం వృక్షాలను నరికి అక్కడ నుంచి 30 కిలోమీటర్లు దూరం దుంగలను మోసుకొచ్చారని తెలిపారు.
అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్టు
చైనాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లిన్‌వెబ్న్‌తోపాటు చెన్నైకి చెందిన నాగూర్‌మీరన్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరి వద్ద నుంచి విలువైన ఏ గ్రేడ్‌కు చెందిన 1,447 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశామని తెలిపారు.