ఆంధ్రప్రదేశ్‌

‘ప్లాన్’ తిరగబడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చిన షరుతులతో కూడిన అనుమతులతో రాజధాని మాస్టర్ ప్లాన్ కథ మొదటికొచ్చినట్టయింది. ఎన్‌జీటీ తీర్పునకు అనుగుణంగా.. రాజధాని నిర్మాణానికి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అనివార్యమని అధికారులు చెబుతున్నారు. ఇదే ప్లాన్‌తో వెళితే ఎన్జీటీ ఉత్తర్వులు వాటికి అవరోధం కల్పిస్తాయంటున్నారు. ఈ తీర్పు ప్రభావం కేవలం నిర్మాణాల ప్లాన్ పైనే కాకుండా, నిర్మాణానికి నిధులిచ్చే సంస్థల తోపాటు, నిర్మాణ పనులు చేపట్టే జాతీయ, అంతర్జాతీయ సంస్థలపైనా పడే అవకాశం లేకపోలేదంటున్నారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపిన ఎన్‌జీటీ తీర్పులో, కీలక అంశమైన కొండవీటి వాగు యథాస్థితినే కొనసాగించాలన్న విషయంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలేమిటన్న విషయం పక్కన పెడితే, ఎన్నో మార్పు చేర్పుల తర్వాత, తుది రూపుకొచ్చిన రాజధాని మాస్టర్ ప్లాన్ ఖరారుపైనే కాకుండా, ఆంక్షలతో నిర్మాణ కంపెనీల రాక పై తీవ్ర ప్రభావం చూపక తప్పదంటున్నారు. పర్యావరణ అనుమతుల నివేదికలో పేర్కొన్న విధంగా.. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపడుతున్న లింగాయపాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి పరిసరాల్లోని నేల అత్యంత విలువైందని, అక్కడ భూగర్భంలో నీటి ప్రవాహాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్టు పేర్కొంటుండగా, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలతో ఎటువంటి ఇబ్బందులుండవని, నిబంధనలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ నిబంధనలు పాటిస్తే మాస్టర్ ప్లాన్ అమలు కష్టమేనని నిపుణులు చెబుతుండగా, తీర్పుతో రాజధాని భవన కట్టడాల కథ మొదటికొచ్చినట్టయింది. అలాగే కొండవీటి వాగు ప్రవాహ పరిధిలో నిర్మిచనున్న రిజర్వాయర్లపై ప్రభుత్వం తగు వివరణను ప్రకటించాల్సి ఉంది. కొండవీటి వాగు సహజ ప్రవాహ దిశను మార్చిన మాస్టర్ ప్లాన్‌లో ‘గ్రీన్’ తీర్పు ప్రకారం మార్పులు తప్పవంటున్నారు. దీంతో కొండవీటి వాగు నిర్మాణం కొండెక్కుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలావుండగా ట్రిబునల్ తీర్పుపై ఇటు అధికార యంత్రాంగంలోనూ, నిర్మాణ నిపుణులలోనూ మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీర్పుతో రాజధాని నిర్మాణ ప్లాన్‌కు తగు మార్పులు చేయాల్సి వస్తుందని కొందరు, ఒకవేళ ఆయా మార్పులు జరిగినా మొత్తం అమరావతి నిర్మాణ డిజైన్‌పై చూపే ప్రభావం అంతంత మాత్రమేనని మరికొందరు చెబుతున్నారు. తాజా తీర్పు నేపథ్యంలో మళ్లీ మాస్టర్ ప్లాన్ పురమాయించడం, మళ్లీ దానిని ఖరారు చేయడం వల్ల రాజధాని నగర నిర్మాణం మరింత ఆలస్యమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.