ఆంధ్రప్రదేశ్‌

రాజన్న రాజ్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాలవాడ, నవంబర్ 18: తమ సమస్యలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని పలువురు రైతులు వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్ర 11వ రోజు శనివారం కర్నూలు జిల్లా దొర్నిపాడు నుంచి తిరిగి ప్రారంభమైంది. దొర్నిపాడు నుంచి ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ వరకు జరిగిన యాత్రలో దారి వెంట సీడ్ పత్తి రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దసంఖ్యలో తరలివచ్చిన యువనేతను కలిశారు. సీడ్ పత్తి ఎన్నోఏళ్లుగా సాగు చేస్తున్నా గిట్టుబాటు ధర లబించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మొరపెట్టుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో విత్తనోత్పత్తి సరఫరా చేసే సీడ్ యజమానులను ఒక చోటికి చేర్చి వారితో చర్చించి మద్దతు ధర కల్పించారని గుర్తుచేశారు. గతంలో మోన్‌శాంటో కంపెనీ 750 గ్రాముల విత్తనాలకు కేవలం రూ. 200కు కొనుగోలు చేసి తిరిగి రైతులకు 450 గ్రాముల ప్యాకెట్ రూ. 1,650కి అమ్మేవారన్నారు. దీంతో ఆ కంపెనీపై వైఎస్ న్యాయ పోరాటం చేసి విజయం సాధించారన్నారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు అప్పట్లో రూ. 500 చెల్లించేవారని, దాన్ని ఆ తరువాత రూ. 420కు తగ్గించారన్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జగన్ స్పందిస్తూ వచ్చేది మన ప్రభుత్వమేనని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. 65 సంవత్సరాలు దాటినా వృద్ధులు, అర్హులైన వితంతువులు, వికలాంగులకు ఫించన్లు అందలేదని పలువురు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ ఫించన్లు అందిస్తామన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఫించన్లు అందజేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. విద్యాపరంగా ప్రతి కుటుంబంలో చదువుకునే పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడమేగాక చేతి ఖర్చులకు రూ. 20 వేలు అందిస్తామన్నారు. ఎన్నికల నాటికి పొదుపు మహిళలకు బ్యాంకుల్లో ఎంత రుణం అంతమొత్తం నగదు రూపంలో నాలుగు దఫాలుగా అందజేస్తామన్నారు. ఈ యాత్రలో పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైకాపా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆళ్లగడ్డ వైకాపా ఇన్‌చార్జి గంగుల బ్రిజేంద్రారెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, రాష్ట్ర గవర్నింగ్ సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, వైకాపా నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎర్రబోతుల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, తులశిరెడ్డి, గుండం సూర్య ప్రకాష్‌రెడ్డి, అధిక సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం..ఉయ్యాలవాడ మండలంలో ఆర్టీసీ బస్సులో వెళ్తున్న వారితో కరచాలనం చేస్తున్న జగన్