ఆంధ్రప్రదేశ్‌

సుశీల, దానాగిలస్పేకు జీవితకాల సాఫల్య పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 19: పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకల్లో భాగంగా గానకోకిల పి.సుశీల, విశ్వవిఖ్యాత పాప్‌సింగర్ దానాగిలస్పేకు జీవితకాల సాఫల్య పురస్కారాలు అందించారు. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయి సన్నిధిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సత్యసాయి ఇందిరమ్మ వెల్ఫేర్ ట్రస్టు జీవితకాల సాఫల్య పురస్కారాలను ట్రస్టు చైర్మన్ చేతనరాజ్ వీరికి అందజేశారు. ఈ సందర్భంగా చేతనరాజ్ మాట్లాడుతూ గానాన్ని ఆరాధించే ప్రతి మదిలో సుశీల చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆమె మధుర గానం భగవాన్ సత్యసాయి బాబాను సైతం రంజింపచేసిందన్నారు. సత్యసాయిని ఆరాధించే అమిత భక్తురాలు సుశీల అన్నారు. ప్రముఖ పోప్ సింగర్ దానాగిలస్పే పాశ్చాత్య బాణీలలో సత్యసాయిపై ఆలపించిన గీతాలు ఖండాంతరాల్లో ప్రసిద్ధిగాంచాయన్నారు. సంగీత అభిమానులను మంత్రముగ్ధులను చేశాయన్నారు. ఈ సందర్భంగా దానాగిలస్పే బాబాపై పాశ్చాత్య బాణీలో ఆలపించిన భక్తిగీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

చిత్రం..జీవితకాల సాఫల్య పురస్కారం అందుకుంటున్న గాయని సుశీల