ఆంధ్రప్రదేశ్‌

పోలవరం కాల్వలో బాలిక గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, నవంబర్ 19: కార్తీక మాసం ముగిసిన సందర్భంగా కృష్ణా జిల్లా మంగళాపురం దగ్గర పోలవరం కాలువలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఓ బాలిక నీటిలో గల్లంతైంది. నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని పాతపాడు మంగళాపురంలో నివాసముంటున్న సోమిశెట్టి పానయ్య తాపీపని చేస్తుంటాడు. ఇతని కుమార్తె శే్వత(13) స్థానిక సెయింట్ జోసఫ్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. కార్తీక మాసం ముగిసిన సందర్భంగా వెంకటరమణ, ఆమె కూతురు మంజురాణి (13)లతో కలిసి శే్వత ఆదివారం ఉదయం పుణ్యస్నానాలకు పోలవరం కాలువకు వెళ్లింది. వీరు ముగ్గురూ కాలువలో స్నానానికి దిగి అదుపుతప్పి నీటిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు ప్రసాద్, రామకృష్ణ మంజురాణి, వెంకటరమణలను కాపాడారు. శే్వత ఆచూకీ మాత్రం లభించలేదు. విషయం తెలుసుకున్న సీఐ సహేరా బేగం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌టీఆర్‌ఎఫ్, ఫీషరీస్, రెవెన్యూ సిబ్బందికి తెలియజేశారు. వారు శే్వత కోసం పోలవరం కాలువలో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీఐ వివరించారు.