ఆంధ్రప్రదేశ్‌

మాకూ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ఎమ్మెల్యేల మాదిరిగా తమకూ నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించాలని ఎమ్మెల్సీలు కోరగా, సాధ్యం కాదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన మండలి సమావేశాల్లో సోమవారం ఎమ్మెల్సీలకు కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించే అంశం పరిశీలనలో ఉందా.. అని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి ప్రశ్నించారు. చిన్న చిన్న పనులు చేపట్టేందుకు వీలుగా వివిధ శాఖల అధికారులకు నిధులు కేటాయిస్తున్నారని, డీఈఓలకు కోటి రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్సీలకు కోటి రూపాయలను నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించేవారన్నారు. తెలంగాణలో ఈ మొత్తాన్ని 3 కోట్ల రూపాయలకు పెంచారని తెలిపారు. కర్నాటకలో ఇస్తున్నారని, తమకూ ఎమ్మెల్యేల మాదిరిగా నిధులు కేటాయించాలని, కేటాయింపులు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఇష్టానికే వదిలేస్తామని తెలిపారు. మూడు జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ నిధుల కేటాయింపు పునరుద్ధరించాలన్నారు. ఎమ్మెల్సీ పివి మాధవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీలు అంటే ఆరో వేలిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానకరంగా ఉంటోందని, గౌరవం పెంచేలా నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి స్పందిస్తూ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సీడీఏఫ్ నిధులు కేటాయించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఈ కేటాయింపులు నిలిపివేశామన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొనసాగించలేకపోతున్నామని, ఇప్పట్లో పునరుద్ధరించే యోచన లేదన్నారు. సిఎం వద్ద 500 కోట్ల రూపాయలను స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఉంచామని, సిఎంని కోరి నిధులు మంజూరు చేసుకోవచ్చని సూచించారు.