ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ స్థాయి రాజధాని ఇక కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్ర విభజన అనంతరం అంతులేని ఆశలు చూపి, లేదా బెదిరించి దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏడాది పొడవునా పలురకాల పంటలు పండించే రైతుల నుంచి దాదాపు 34వేల ఎకరాల భూమిని సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెంపదెబ్బ లాంటిదేనని ఆ కేసులో ప్రధాన పిటిషనర్‌దారుడైన పండలనేని శ్రీమన్నారాయణ అన్నారు. ఈ తీర్పుపై ఎవరెన్ని రకాలుగా ఎవరికి వారు తమకనుకూలంగా చిత్రీకరించుకుంటున్నప్పటికీ రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాల్లో కొండవీటి ముంపు పరీవాహక ప్రాంతం కింద 15వేల ఎకరాలు, కృష్ణానదీ ముంపు పరీవాహక ప్రాంతం కింద 10వేల ఎకరాల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్జీటీ ఇచ్చిన తీర్పును విదేశాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ పిటిషన్‌ను తోసిపుచ్చిందని చేస్తున్న వాదన సరికాదంటూనే, తగిన న్యాయం కోసం ముగ్గురు న్యాయవాదులిచ్చిన తీర్పును ఐదుగురు న్యాయమూర్తుల ఫుల్‌బెంచ్ ఎదుట సవాల్ చేస్తామని చెప్పారు. ఆపై సుప్రీంకోర్టు, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ఏమాత్రం వెనుకాడే ప్రసక్తి లేదని విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి మొదటి నుంచీ తాను వ్యతిరేకిని కాదని, అయితే అత్యంత అందుబాటులో కృష్ణానదీ జలాలు, భూగర్భ జలాలతో ఏడాది పొడవునా పలురకాల పంటలు పండే ఆ ప్రాంతంతో పాటు పర్యావరణాన్ని, నదీతీరాన్ని పర్యవేక్షించేందుకు న్యాయపోరాటం సాగిస్తున్నానని చెప్పారు. తన పోరాటం వెనుక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ లేదని, అసలు జగన్‌ను తాను ఇంతవరకు వ్యక్తిగతంగా కలవలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన కేసుల వల్లనే రాజధాని డిజైన్ ఖరారులో జాప్యం జరుగుతోందనే దానిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరపరాదంటూ తాను దాఖలు చేసిన పిటీషన్‌పై ఎన్జీటీ స్టే ఆర్డర్ ఇవ్వగా ప్రభుత్వం మూడు మాసాల అనంతరం పాత తేదీతో అన్ని అనుమతులు వచ్చిన తరువాతే నిర్మాణాలు కొనసాగిస్తున్నామంటూ కోర్టుకు నివేదించిందన్నారు. సీఆర్‌డీఏ 2014 డిసెంబర్ 30న ఏర్పాటు కాగా టాటా కన్సల్టెన్సీ నివేదికను అందజేసిన దేశ్‌పాండే 2014 జూలై 7వ తేదీతో సీఆర్‌డీఏకు నివేదిక ఇచ్చినట్టు ఎన్జీటీని తప్పుదారి పట్టించారని, ఈ విషయమై దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పట్టించుకోలేదన్నారు. ఎన్జీటీ తీర్పు ప్రకారం కొండవీటి వా గును విస్తరింపచేయడం, మలుపులు తిప్పడం, లోతు పెంచడం వంటివి చేయకూడదన్నారు. అయితే వంద కోట్లతో ఒక ప్రైవేట్ కంపెనీ చేపడుతున్న పనులను తక్షణం నిలిపివేయాల్సిందేనని ఆయనన్నారు. అలాగే ప్రస్తుత కరకట్టను అటుఇటూ కదలించరాదన్నారు. పైగా నదీ ప్రవాహానికి 100 మీటర్ల దూరంలో ఎలాంటి కట్టడాలు ఉండరాదని కోర్టు ఆదేశించినందున సీఎం నివాస గృహంతో పాటు అన్నిరకాల భవనాలను తప్పక తొలగించాల్సిందేనన్నారు. అలాగే వరద ముంపు ప్రాంతంలో మరో 10వేల ఎకరాల్లోను ఎలాంటి కట్టడాలు ఉండరాదన్నారు. దీన్నిబట్టి ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న సచివాలయం, అసెంబ్లీ భవనాలను తప్పనిసరిగా కూల్చాల్సి వస్తుందన్నారు. రెండోదశలో సింగపూర్ సంస్థ 1694 ఎకరాల్లో 9 నగరాలతో డిజైన్ చేసిన సీడ్ క్యాపిటల్ కూడా నిషిద్ధ ప్రాంత పరిధిలోకే వస్తున్నందున ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ రాజధాని నిర్మాణం జరగబోదని ఆయన వివరించారు.