ఆంధ్రప్రదేశ్‌

దీపికా, రానా, అనిరుథ్‌కు సోషల్ మీడియా పాపులర్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినీ నటులకు విజయవాడలో ఆదివారం అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా సమ్మిట్, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ఇండియన్ నటిగా దీపికా పదుకొనే, మోస్ట్ పాపులర్ సంగీత దర్శకునిగా అనిరుథ్ రవిచందర్, మోస్ట్ యాక్టివ్ సౌత్ ఇండియన్ నటునిగా రానాకు అవార్డులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అందచేశారు. ఈసందర్భంగా దీపికా పదుకొనే మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడానికి అభిమానులే కారణమన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎలాంటిదో తనకు తెలుసునన్నారు. తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటానికి కారణం తాను ఏ పని చేసినా మనసు పెట్టి చేయడమేని ఆమె వ్యాఖ్యానించారు. ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. నాకు మీరు చాలా బాగా నచ్చారు’ అంటూ దీపికా తెలుగులో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు. అమరావతికి ధన్యవాదాలు తెలిపారు.

చిత్రాలు..దీపికా, రానా, అనిరుథ్‌కు సోషల్ మీడియా పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తున్నా మంత్రి అఖిలప్రియ