ఆంధ్రప్రదేశ్‌

ఓటు..ఆధార్ లేని వాళ్లూ మాట్లాడుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 20:మన రాష్ట్రంలో ఓటు..ఆధార్ కార్డులేని వాళ్లూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మండి పడ్డారు. జ్యూరీ నిర్ణయించిన నంది ఆవార్డులపై విమర్శలు చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు బాధపడుతున్నారని తెలిపారు. అప్పట్లో ప్యాకేజీ కాదంటే ప్రఖ్యాత కియా కంపెనీ రాష్ట్రానికి వచ్చేదా అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్ రెసిడెంట్ ఆంధ్రా (ఎన్‌ఆర్‌ఏ) వాళ్లు మాత్రమే ఏపి ప్రభుత్వంపై పనిగట్టుకుని తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ ఆధార్‌కార్డు, ఓటరు కార్డు లేని వారు హైదరాబాద్‌లో కూర్చుని నంది అవార్డులపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. నంది అవార్డుల ఎంపిక జ్యూరీలో సభ్యులుగా ఉన్నవాళ్లు కూడా విమర్ళలు చేయడం పట్ల లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. నంది అవార్డులపై అనంతర పరిణామాల్లో విమర్శలు రావడంతో సిఎం చాలా బాధపడ్డారని తెలిపారు. హైదారాబాదులో కూర్చుని ఏపిలో ఏం చేయాలో చెబితే ప్రజలు హర్షించరన్నారు. ఇద్దరు ముగ్గురు మాత్రమే చేసే విమర్శలను కొందరు ప్రధానంగా చూపించడం వల్లనే వివాదం మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. అసలు అవార్డులు ఇవ్వని ప్రభుత్వాన్ని ఎమీ అనలేని వాళ్లు ఇచ్చిన తమకు రాళ్ల దెబ్బలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికత లేని వారికి అవార్డులు గురించి విమర్శించే హక్కుల కూడా లేదని విమర్శించారు. ఇక పోతే ప్రత్యేక హోదా అంటూ కోందరు హైదరాబాదు నుంచి ఉదయం విమానంలో విజయవాడకు వచ్చి ధర్నా చేసి తిరిగి మధ్యాహ్నం విమానానికి తిరిగి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. హోదా కోసం అసెంబ్లీని ముట్టడిస్తే ఎలా అని ప్రశ్నించారు.