ఆంధ్రప్రదేశ్‌

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 359 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 2017-18 విద్యా సంవత్సరం నుండి 645 డిజిటల్ తరగతుల గదుల ఏర్పాటుకు అనుమతిస్తూ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌పి సిసోడియా సోమవారం జీవో 98ను విడుదల చేశారు. ఇలాఉంటే డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టకుండా అన్ని సంక్షేమ, రెసిడెన్షియల్, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించినప్పుడే సంబంధిత లక్ష్యం నెరవేరుతుందని, అన్ని పాఠశాలల్లో వెంటనే కంప్యూటర్ టీచర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా కోరారు.