ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి మరో ఆరు నీట్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్సు టెస్టు (నీట్) నిర్వహించే కేంద్రాలను రాష్ట్రానికి మరో ఆరింటిని మంజూరు చేశారు. గతంలో నాలుగు కేంద్రాలు ఉండగా, వాటి సంఖ్యను తాజాగా 10కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, చీరాల, నెల్లూరు, తిరుపతి, కర్నూల్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీంతో కొంత మేరకు విద్యార్థులకు ఊరట లభించింది. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. అదనంగా పరీక్షా కేంద్రాలను మంజూరు చేయడం పట్ల కేంద్ర మంత్రి జెపి నడ్డాకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.