ఆంధ్రప్రదేశ్‌

రూ.20 వేల కోట్లతో కోస్టల్ కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: రాష్ట్రంలోని 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో దాదాపు రూ.20వేల కోట్లతో కోస్టల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంకల్పంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శాసనసభ సమావేశాల ఐదవ రోజైన సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో తీరప్రాంత కారిడార్‌పై సభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 9 కోస్తా జిల్లాలతో ముడిపడి ఉన్న ఈ కోస్టల్ కారిడార్‌ను ఇచ్చంపేట-విశాఖ, విశాఖ-నర్సాపురం, నర్సాపురం-ఒంగోలు, ఒంగోలు-తడ వరకు నాలుగు ప్యాకేజీలుగా చేపడతామన్నారు. ఇందుకు కన్సల్టెన్సీలను కూడా నియమించామన్నారు. ఈ బీచ్ రోడ్డు తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవులను అనుసంధానిస్తుందని, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేటంతో రవాణా మెరుగుపడుతుందన్నారు. దానివల్ల పారిశ్రామిక ప్రగతితో పాటు వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తులను సమీప మార్కెట్‌కు తరలించేందుకు, దోహదపడగలదన్నారు. సభ్యులు చాంద్‌బాషా, బండారు సత్యనారాయణ, పి.విష్ణుకుమార్‌రాజు, తదితరులు మాట్లాడారు.