ఆంధ్రప్రదేశ్‌

అంబటికి నోటీసుపై ‘దేశం’లో భిన్నవాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 21: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిన వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన సభ్యులు.. అంబటికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సూచించడంపై, తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో విభిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. సత్తెనపల్లిలో జరిగిన ఓ సంఘటనలో ప్రత్యక్షంగా హాజరైన అంబటి స్పీకరునుద్దేశించి వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దానిపై మంగళవారం నాటి సభలో మాట్లాడిన చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, బండారు సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, గీత, కూన రవికుమార్, విష్ణుకుమార్‌రాజు స్పీకర్‌పై పరుష పదజాలం వాడి, స్పీకర్ వ్యవస్థపై దాడి చేసిన అంబటికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఒకసారి అలాంటి వారికి నోటీసులిస్తే మరొకరు స్పీకర్ వ్యవస్థపై దాడి చేసే సాహసం చేయబోరని సూచించారు. అయితే, తాను సభానాయకుడైన ముఖ్యమంత్రి, సభావ్యవహారాల మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీలో భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అంబటికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, దానికంటే పార్టీపరంగానే ఆయనపై ఎదురుదాడి చేయడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు జగన్ గురించే మాట్లాడవద్దని, ఆయన గురించి ప్రజలే మర్చిపోతుంటే మనం ఎందుకు మాట్లాడి అతనిని ఎందుకు గుర్తించాలని స్వయంగా చంద్రబాబునాయుడే చెబుతుంటే, జగన్ స్థాయి లేని అంబటిని సభకు పిలిపించడమంటే, ఆయనను జగన్ కంటే పెద్దవాడిని చేయడమేనని కొందరు విశే్లషిస్తున్నారు. అంబటి ఆరోపణల్లో కొత్తదనమేమీ లేదని, సత్తెనపల్లిలో గత మూడేళ్ల నుంచి అంబటి రాంబాబు కోడెల కుటుంబంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, అటు కోడెల వర్గీయులు కూడా అంబటిపై ప్రత్యారోపణలు చేస్తున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. వాటిపై పార్టీపరంగానో, వ్యక్తిగతంగా కోడెల కుటుంబసభ్యులో అంబటిపై పరువునష్టం దావా వేస్తే సరిపోతుందంటున్నారు. స్పీకర్‌కు, సభకు ఉన్న విచక్షాణాధికారాల ప్రకారం తలచుకుంటే ఎవరినైనా జైలుకు పంపించే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కారు డ్రైవర్‌కు 40 రోజులు జైలు శిక్ష విధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ ఘటన తెలంగాణ సమాజాన్ని బాగా రెచ్చగొట్టడంతోపాటు, వ్యక్తిగతంగా ఈటెలకూ రాజకీయ లబ్ధి చేకూర్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, అంబటి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే స్పీకర్ వ్యవస్థ చులకన అయ్యే ప్రమాదం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. భయం లేకపోతే రేపటి నుంచి ప్రతి ఒక్కరూ స్పీకర్ గురించి, సభ గురించి మాట్లాడతారని హెచ్చరిస్తున్నారు. అంబటిని కమిటీ ముందుకు పిలిపించి మందలిస్తే, భవిష్యత్తులో వైసీపీ నేతలెవరూ ఇకపై స్పీకర్, సభను విమర్శించే అవకాశాలుండవని స్పష్టం చేస్తున్నారు. గతంలో కరణం బలరామ్‌పై కూడా ఇదేవిధంగా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతకంటే కొనే్నళ్లకు ముందు.. ఒక దినపత్రికలో శాసనమండలినుద్దేశించి రాసిన శీర్షికపై ఆగ్రహించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, సదరు సంపాదకుడిని సభకు పిలవాలని నోటీసులు జారీ చేసిందిః తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చి, కౌన్సిల్‌నే రద్దు చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
పిలిపించవచ్చు: మైసూరా
కాగా స్పీకర్‌పైనా, సభపైనా ఏ స్థాయి వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారిపై చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం స్పీకర్‌కు ఉందని సీనియర్ పార్లమెంటేరియన్, మాజీ మంత్రి డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి చెప్పారు. అవసరమైతే అతనికి జైలు శిక్ష విధించే అధికారం ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తులయినా పిలిపించవచ్చన్నారు.