ఆంధ్రప్రదేశ్‌

రైతుల్లో మనోధైర్యాన్ని నింపాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 21: సంక్షోభంలో ఉన్న రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి, తామున్నామన్న భరోసాను కల్పించి, వారిలో మనోధైర్యాన్ని నింపగలిగామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అన్నదాతను నిరుత్సాహ పరిచేవిధంగా ప్రతిపక్షనేత జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతుల్లో ఎనలేని అనందం ఉందన్నారు. శ్రీశైలం నిండడంతో ప్రతిపక్షాలకు మండుతోందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం వ్యవసాయ, అనుబంధ రంగాలపై స్వల్ప వ్యవధి చర్చను నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ఈఎడాది అగస్టు వరకు వర్షాలు లేక, కృష్ణా, పెన్నా నదిలో నీరు లేక సేద్యం కాస్త మందగించిందన్నారు. ఇదే సమయంలో పట్టిసీమ ద్వారా నీరు తీసుకురావడంతో కృష్ణా డెల్టాను కాపాడుకోవడంతో పాటు, తరువాత వర్షాలు సమృద్ధిగా పడటంతో 81శాతం సాగు చేయగలిగామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో సాంకేతికతను జోడించేందుకు బిల్‌గేట్స్ వంటి ప్రపంచ దిగ్గజాలతో ఒప్పందాలు కదుర్చుకున్నట్లు తెలిపారు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని గట్టేక్కించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నందునే నేడు మంచి ఫలితాలు వ్యవసాయ రంగంలో సాధించగలిగామన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రంలో వర్షాలు కురవకూడదు, పంటలు పండకూడదు అంటూ అలోచిస్తూ ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారానే వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించినట్లు తెలిపారు. అనుబంధ రంగాలను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఏఎంసీలు వ్యాపార సంస్థలుగా ఉండేవని ప్రస్తుత తెదేపా ప్రభుత్వంలో వాటి ద్వారా రైతులకు ఉత్తమ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ సాధ్యం కాదు అన్న వారి నోరు మూయించే విధంగా రుణమాఫీ చేసి చూపించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రైతును అప్పుల ఉబి నుండి బయటకు తీసుకు రావడంతో పాటు వారిని వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ప్రోత్సహిస్తున్నట్ల తెలిపారు. ఇదే సమయంలో శ్రీకాకుళంలో తుఫాన్‌తో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా అదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు రుణ మాఫీని ధైర్యంగా అమలు చేసిన ధీరుడు చంద్రబాబు అని బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పొగడ్తలతో ముంచెత్తారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగం బలోపేతం కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో జలయజ్ఞం, మేఘమథనం, ఆదర్శరైతులు అంటూ ఆర్భాటాలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేశారే తప్ప ఫలితం లేదన్నారు. రైతులపై ఉన్న అభిమానాన్ని చంద్రబాబు తన చేతలతో చేసి చూపించారన్నారు. ఆర్గానిక్ రైస్‌ను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు.