ఆంధ్రప్రదేశ్‌

బీసీ సంఘాల భిన్నదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 21: కాపులను బీసీలలో చేర్పించడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు చేస్తున్న పోరాటంలో భిన్నదారులు మొదలయ్యాయి. కాపులను బీసీల్లో చేర్పించకుండా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసిన వైనంపై బీసీ సంఘాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం కృష్ణయ్య ప్రతినిధి బృందంలో ఆయన సంఘానికి ఏపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న కేశన శంకర్‌రావు దూరంగా ఉండటం బీసీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శంకర్‌రావు సోమవారం నాటి కార్యక్రమానికి దూరం ఉండటానికి, ఆయనపై ఏపీ బీసీ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమంటున్నారు. స్వయంగా కృష్ణయ్య నియమించిన రాష్ట్ర అధ్యక్షుడే ఆ కార్యక్రమాన్ని విభేదించడం చర్చనీయాంశమయింది. దీనిపై ఆయన వివరణ కోరినప్పటికీ నోకామెంట్ అని జవాబు దాటవేశారు. కాపులకు బీసీ హోదా ఇవ్వవద్దని తాము గత మూడేళ్లుగా పోరాటం చేస్తున్నామని, 13 జిల్లాల్లో మంజునాథ కమిషన్‌ను నిలదీసి, పోలీసులతో దెబ్బలు తిన్నప్పుడు, ఈ నేతలు ఎక్కడకు వెళ్లారని ఏపీ బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమకు తెలంగాణ నేత కింద పనిచేసే అవసరం లేదని, ఏపీలో చాలామంది సమర్థవంతులైన నేతలున్నారని, వేరే వారి నుంచి పోరాటాలు నేర్చుకోవలసిన పనిలేదంటున్నారు. కృష్ణయ్య టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ అదే పార్టీ తీసుకునే నిర్ణయంపై పోరాడటాన్ని బీసీలు నమ్మరని, ముందు ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేయాలంటున్నారు. ‘కృష్ణయ్య రాజీనామాతోనయినా బాబు నిర్ణయంపై ప్రభావం ఉంటుందేమోనిన్న మంత్రులను కలిసిన వారిలో ఎక్కువమంది టీడీపీకి అనుబంధంగా ఉన్న వాళ్లే కనిపించారు. అందుకే మేం ఎవరూ వెళ్లలేద’ని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ హక్కులు మంటకలుస్తుంటే, అక్కడి ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఏపీ వచ్చి పోరాడాల్సిన అవసరం లేదని బీసీ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మంజునాథ కమిషన్‌ను బీసీ సంఘాలు కలసినప్పుడు అదే సమావేశంలో తామంతా కృష్ణయ్యను పార్టీకి రాజీనామా చేసి పోరాడితే, బాబు దిగివస్తారని చెప్పినా ఆయన ఆ పనిచేయకుండా ఏపీలో నాయకత్వం కోసం పాకులాడుతున్నారని బీసీ నేతలు చెబుతున్నారు. ఏపీలో సమర్థవంతమైన బీసీ నేతలు చాలామంది ఉన్నారని, తమకు పక్క రాష్ట్ర నేతల నాయకత్వం అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కృష్ణయ్య చేసే పోరాటాలకు తమ మద్దతు ఉండదని, కొంతమంది ఆయన సొంత కులం వారు, టీడీపీ మద్దతుదారులతో చేసే పోరాటాలను పట్టించుకోరంటున్నారు. కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, గత మూడేళ్లుగా తాము రోడ్డెక్కి చేస్తున్న ఉద్యమాల్లో పాల్గొనకుండా, ఉదయం విజయవాడ వచ్చి రాత్రికి హైదరాబాద్ వెళ్లే నేతల సాయం తమకు అవసరం లేదని ఖరాఖండీగా చెబుతున్నారు.