ఆంధ్రప్రదేశ్‌

మందకృష్ణకు ఇక్కడేం పని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 21: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కొంతమంది కులసంఘాల నేతలు చిచ్చు పెడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మందకృష్ణ మాదిగ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ఆయనకు ఇక్కడేం పని? ఈ రాష్ట్రంలో మాదిగలకు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం. వాళ్ల సంక్షేమం చూస్తున్నాం. అయినా అందరినీ కలబెట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నార’ని వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన పార్టీ వ్యూహకమిటీ సమావేశంలో ఎమ్మార్పీఎస్ చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ సందర్భంగా బాబు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తీరుపై విరుచుకుపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన నాకు తెలంగాణ తప్ప ఏదీ ముఖ్యం కాదన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చి అందరినీ రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు. అతనికి క్రెడిబిలిటీ లేదు. మనం మాదిగలకు ఏం చేశామన్నది మీరు ప్రచారం చేయాలి. పక్క రాష్ట్రం వాళ్లు ఇక్కడకు వచ్చి ఉద్యమాల పేరుతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టడమేమిట’ని వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను అన్ని రూపాల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనా ఉందని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్షం లేకపోయినా సీరియస్‌గా ఉండాలన్నారు. సభలో ఒక్కో అంశంపై చర్చ జరుగుతుందని, దానిపై సభ్యులు కసరత్తు చేయాలని సూచించారు. పోలవరం, అమరావతి అభివృద్ధి, నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యావిధానం, ఉపాథి కల్పన వంటి కీలక అంశాలపై చర్చించనున్నందున, మాట్లాడే వారు తగిన మెటీరియల్‌తో రావాలని సూచించారు. ముఖ్యంగా కీలకలమైన అమరావతి, పోలవరం పై చర్చ సమయంలో ఇక మిగిలిన అంశాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించారు. అలాచేస్తే ఆ అంశాలు పక్కదారిపట్టే ప్రమాదం ఉందని భావించారు. సభలో మరింత సమన్వయం ఉండాలన్నారు. ‘మీరు మరీ ఎక్కువగా పొగిడే ప్రశ్నలు కాకుండా కొంత విమర్శనాత్మకంగా ఉండే ప్రశ్నలు వేసినా ఫర్వాలేదు. మన చర్చ, దానికోసం చేస్తున్న కసరత్తు బాగుందని జనంలో అనిపించాల’ని సూచించారు. నంది అవార్డులపై మరికొంత కసరత్తు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. సభలో హాజరుశాతం బాగానే ఉన్నప్పటికీ, ఇంకా సీరియస్‌నెస్ ఉండాలన్నారు.