ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 21: నీతి, నిజాయితీలే పెద్ద ఆస్తి, అదే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని స్వయం సహాయక సంఘాల మహిళలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రికలన్నారు. మంగళవారం స్థానిక ఏ కనె్వన్షన్ సెంటర్‌లో ఆంధ్రాబ్యాంకు దేశంలోనే ప్రథమంగా చేపట్టిన పట్ట్భా సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వినూత్నమైన ఆలోచనలకు ఆంధ్రాబ్యాంకు నాందిగా నిలుస్తోందని, ఉన్నత భావాలు, విశిష్ట వ్యక్తిత్వం గల ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపక చైర్మన్ భోగరాజు పట్ట్భా సీతారామయ్య పేరు మీద స్వయం సహాయక సంఘాల తీరు తెన్నులను మార్చే విధంగా స్వయం వ్యాపార సంఘాల పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. స్వయం సహాయక సంఘాలు తన మానస పుత్రికలన్నారు. వీరి ఆత్మగౌరవాన్ని పెంచి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని స్వయం సహాయక సంఘాలకు శ్రీకారం చుట్టానన్నారు. సమన్వయం, సంఘటిత శక్తిగా ఉండాలని కోరుకున్నానని, దేశంలోనే మన డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. విజయభారతి అనే మహిళ స్ఫూర్తివంతమైన రీతిలో డ్వాక్రా సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కొనసాగించడం అభినందనీయమన్నారు. ఒక అన్నగా మీకు తోడుగా ఉంటూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలపై తనకు ఎంతో నమ్మకముందని, బీమా మిత్రాలుగా స్కాలర్‌షిప్‌లు, పింఛన్ల పంపిణీ, గ్యాస్ కనెక్షన్లను అందించడంలో చూపిన చొరవ అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. మిమ్మల్నే ‘మ్యారేజ్ మిత్రాలుగా కూడా నియమిస్తామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రుణమాఫీని అమలు చేశామన్నారు. 2018 మార్చి నాటికి ప్రతి డ్వాక్రా మహిళ తప్పనిసరిగా మరుగుదొడ్లను కట్టుకోవాలన్నారు. గ్రామాల్లో చౌకధరల దుకాణాల స్థానంలో విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని నిత్యావసర సరుకులను అందించడంతోపాటు ఆర్ధికంగా బలోపేతం అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు రూ.9,964 కోట్ల కార్పస్ ఫండ్ కలిగి పెద్ద ఆర్ధిక శక్తిగా మహిళా సంఘాలు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి కలిగిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందిస్తామన్నారు. కుటుంబ ఆర్ధిక చేయూతతో పాటు విద్యాపరంగా కూడా మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్య ఉన్నప్పుడే నైపుణ్యాభివృద్ధిలో గణనీయమైన వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎస్‌బిజి పథకం కింద 184 గ్రూపులకు చెందిన 1100 మంది మహిళలకు రూ.13.14 కోట్ల మేర రుణాలను అందించడం ద్వారా ఆంధ్రాబ్యాంక్ వారు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. మంత్రి పరిటాల సునీత, నాబార్డ్ డిప్యూటీ ఎండి హెచ్‌ఆర్ దవే, ఆంధ్రాబ్యాంక్ ఎండి సురేష్ ఎన్ పాటిల్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సెర్ప్ సిఈఓ పి.కృష్ణమోహన్, జిఎంలు ఎస్.సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.... ఆంధ్రా బ్యాంకు స్వయం వ్యాపార సంఘాల పథకం ప్రారంభోత్సవంలో మహిళకు రుణం చెక్కు అందచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు