ఆంధ్రప్రదేశ్‌

కరకట్ట రోడ్డుకు వీవీఐపీ హోదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: ఏక్‌దిన్ కా సుల్తాన్ తరహాలో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కరకట్ట రోడ్డుకు వివిఐపి హోదాను పోలీసులు కట్టబెట్టారు! పోలీసుల అత్యుత్సాహం కరకట్ట మీదుగా వెళ్తున్న ఒక మంత్రి, ఇద్దరు విప్‌లు, ఒక ఎమ్మెల్యేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రజలను ఇక్కట్లకు గురి చేసింది. మంగళవారం సీఎం ఇంటి ముట్టడికి ఎమ్మార్పీస్ పిలుపునిచ్చింది. దీంతో కరకట్ట రోడ్డును వివిఐపి రోడ్డుగా ప్రకటించామని చెబుతూ ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వివిఐపిల వాహనాలను మాత్రమే అనుమతిస్తామంటూ కరకట్ట మీదుగా ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం, మందడం వరకూ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అన్ని వాహనాలను ఉండవల్లి, పెనుమాక మీదుగా మళ్లించారు. పోలీసుల ప్రతాపానికి మంత్రి కామినేని శ్రీనివాస్, విప్‌లు కూన రవికుమార్, యామినీ బాల, ఎమ్మెల్యే రామాంజనేయులు చేదు అనుభవాన్ని చవి చూశారు. అసెంబ్లీకి ఈ దారి మీదుగా అనుమతించమని పోలీసులు చెబుతూ వీరి వాహనాలను అడ్డుకున్నారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా ఇది వివిఐపి రోడ్డు అని, అనుమతించేది లేదంటూ గన్‌మెన్‌లతో అక్కడి పోలీసులు వాగ్వివాదానికి దిగారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యేలు 15 నిమిషాల సేపు అక్కడే ఉండిపోయారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిని అనుమతించారు. కట్టమీదుగా వాహనాలు అనుమతించకపోవడంతో పెనుమాక మీదుగా వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మార్పీస్ ముట్టడి కారణంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు పగలే చుక్కలు చూపించారు. వెంకటాపాలెం, మందడం, తదితర ప్రాంతాల ప్రజలను రోడ్డుమీదకు రానివ్వలేదు. ఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న పోలీసుల వైఖరిపై ప్రజలు మండిపడ్డారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా ఈ బాధలేమిటని పోలీసుల తీరును విమర్శించారు. గత రెండు రోజులుగా పోలీసుల వైఖరితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోజు చలో అసెంబ్లీ పిలుపు, ఒక రోజు సీపీఎస్ వ్యతిరేక ఉద్యమం, మంగళవారం ఎమ్మార్పీఎస్ ముట్టడి ... దీంతో కట్ట మీద ప్రయాణం పోలీసుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది. సీఎం ఇల్లు అక్కడ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ రెండు సార్లు దాదాపు గంటన్నర సేపు కట్టమీద రాకపోకలు సీఎం కోసం నిలిపివేస్తున్నారు. సీఎం ఇల్లు వేరే చోటికి తరలించాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యవసర వైద్య సేవలు, పరీక్షలు వంటి సందర్భాల్లో కట్టవెంబడి ప్రయాణం ఏ సమయంలో అనుమతిస్తారో? తెలియని పరిస్థితి నెలకొంది.