ఆంధ్రప్రదేశ్‌

సుస్థిర అభివృద్ధి దిశగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, (పటమట) నవంబర్ 21: రాష్ట్ర విభజన జరిగి, కట్టుబట్టలతో నవ్యాంధ్రకు వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం శాసనసభలో 344 నిబంధన కింద ‘ఏపీ సుస్థిరత అభివృద్ధి’ అంశంపై ప్రత్యేక చర్చ జరిగిన అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ విజయవాడలో బస్సునే కార్యాలయంగా మార్చుకొని పాలన కొనసాగించానని గుర్తుచేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఒక్కొక్కటి అధిగమించి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించటానికి నిర్దేశించుకున్న 17 లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.
సుస్థిర అభివృద్ధి సాధించటానికి మంత్రులు, అధికారులు కూడా నిర్దేశించిన లక్ష్యాలతో ముందుకెళ్ళాలని అన్నారు. రాష్ట్రంలోప్రతి కుటుంబం ఆనందంగా వుండటానికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెడతామని, 2029 నాటికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో నెంబర్ 1 స్ధానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకువెళుతున్నామని చెప్పారు. అవసరమైతే ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాను యూనిట్‌గా తీసుకొని మరింత సుస్థిర అభివృద్థిని సాధిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చేనాటికి రాష్టల్రో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమించి మిగులు విద్యుత్‌తో వున్నామని, దీంతో రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇళ్లకు విద్యుత్ ఇచ్చామని చెప్పారు. అలాగే నూటికి నూరు శాతం ఇళ్లకు గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చామని చెప్పారు. అంతకుముందు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉండాలనే సీఎం చంద్రబాబు అలోచనతో విజన్ డక్యూమెంట్ రూపొందించి 17 లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 73 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనే వుంటున్నారని, అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వ్యవసాయంలో, గ్రామీణ అభివృద్ధి పెరిగితే రాష్ట్రం సుభిక్షంగా వుంటుందన్నారు. గత సంవత్సరం 148 లక్షల టన్నుల వరి పంట దిగుబడులు సాధించామన్నారు. ఈ మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో రెండు అంకెల అభివృద్ధి సాధించామని చెప్పారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు 11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయన్నారు. వ్యవసాయం తరువాత పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించటానికి బడ్జెట్‌లో మైనార్టీలకు 840 కోట్లు, బీసీలకు 10 వేల కోట్లు, ఎస్సీలకు 8 వేల కోట్లు, ఎస్టీలకు 3 వేల కోట్లు, కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. శాసనసభలో సుస్థిర అభివృద్ధి ప్రత్యేక చర్చ ప్రారంభ సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయానికి 16,500 కోట్లు లోటు బడ్జెట్, లక్ష కోట్లు అప్పులతో నూతన రాష్ట్ర ప్రస్థానం మొదలైందన్నారు. అయినా సీఎం చంద్రబాబు మొక్కవోని ధైర్యంతో 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధి వైపు తీసుకెళుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన నాటికి 24 మిలియన్ల విద్యుత్ కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమంచి సీఎం చంద్రబాబు మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని నిలిపారని తెలిపారు. ఎమ్మెల్యేగా తాము చంద్రబాబులాంటి సీఎం కింద సేవలందించటంతో తమ జన్మధన్యమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పేదరికం శాపంగా మిగిలిపోకుండా వుండాలంటే రాష్ట్రంలో వనరులను సద్వినియోగం చేసుకొని సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించటానికి సీఎం చంద్రబాబు ఒక విజన్‌తో ముందుకెళుతున్నారని తెలిపారు.
చిత్రం..శాసనసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు