ఆంధ్రప్రదేశ్‌

మాజీ సీఎం కిరణ్ సోదరుడు నేడు టీడీపీలో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 22: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు సహా 1500 మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రభావం చూపే నల్లారి కుటుంబం రాకతో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాకు చెక్ పడనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఇప్పటికి మూడోసారి సీఎంగా కొనసాగుతున్నప్పటికీ, సొంత జిల్లాలో పెద్దిరెడ్డి హవాను ఏమాత్రం బ్రేక్ వేయలేకపోతున్నారు. ఆ విషయంలో బాబు తిరుమలకు వచ్చినప్పుడు జరిపిన పలు పార్టీ సమీక్ష సమావేశాల్లో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని పార్టీ నేతల్లో సఖ్యత లేదని, మీతో చేతకాకపోతే, నేను బయట వారిని తీసుకువచ్చి పార్టీ నడిపిస్తానని పలుసార్లు హెచ్చరించారు. అప్పటినుంచే నల్లారి కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అటు నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి దశాబ్దాల నుంచి ఉన్న రాజకీయ వైరాన్ని, నల్లారి కిశోర్‌ను టీడీపీలోకి తీసుకురావడం ద్వారా, తనకు రాజకీయ అనుకూలతగా టీడీపీ మార్చుకోనుంది. పెద్దిరెడ్డిని ఢీకొట్టాలంటే ఇప్పటి పరిస్థితిలో నల్లారి కుటుంబం ఒక్కటే ప్రత్యామ్నాయమని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. నిజానికి కిరణ్ తండ్రి నల్లారి అమర్‌నాధ్‌రెడ్డితో చంద్రబాబునాయుడు తన రాజకీయ ప్రారంభదశలో సన్నిహితుడిగా, అనుచరుడిగా వ్యవహరించారు. బాబు పట్టుపట్టి జడ్పీ చైర్మన్‌గా కుతూహలమ్మను పోటీకి దింపిన నాటి నుంచే వారి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి తల్లి పోటీ చేసినప్పుడు ఆమెపై పోటీ పెట్టడంతో అది రాజకీయ వైరంగా మారింది. ఇది తప్ప రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పెద్ద విబేధాలులేవని అటు నల్లారి కుటుంబం కూడా చెబుతోంది. ఇప్పుడు కిశోర్‌కు రాజకీయంగా టీడీపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపించడం, పెద్దిరెడ్డిని ఎదుర్కోవాలంటే టీడీపీ తప్ప మరొక దారి లేదని భావించిన తర్వాతనే ఆయన సోదరుడైన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇష్టం లేకపోయినా టీడీపీలో చేరుతున్నారు. ఇటీవల నల్లారి కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తి లోకేష్‌ను కలిసినప్పుడు, తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ మధ్య విబేధాలేవీ లేవని స్పష్టం చేశారు. నల్లారి కుటుంబరాకతో జిల్లాలో పార్టీ బలమడుతుందని చెప్పారు. కిశోర్ టీడీపీలో చేరనున్న క్రమంలో చిత్తూరు జిల్లా రాజకీయాలు మారనున్నాయి. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం ప్రస్తుతం వైసీపీ వైపు ఉండగా, కిశోర్ చేరికతో అవి మారే అవకాశం ఉన్నాయంటున్నారు. కిరణ్ కుటుంబాన్ని వ్యతిరేకించే గల్లా అరుణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆమె వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.