ఆంధ్రప్రదేశ్‌

కోడెల అరాచకాలనే ప్రశ్నిస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 22: శాసనసభ అన్నా, సభాపతి అన్నా తనకు అపారమైన గౌరవముందని, ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేసిన తనకు సభా సంప్రదాయాలు తెలుసునని వైఎస్సార్సీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తానెప్పుడూ సభాపతిని గానీ, సభనుగానీ అగౌరవపరచలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు. అలా చేసినట్టు ఎవరైనా భావిస్తే క్షమించాల్సిందిగా కోరుతున్నానన్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన కోడెల శివప్రసాదరావును రాజకీయంగా విమర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం తీసుకురావాలని అసెంబ్లీలో మంగళవారం టీడీపీ సభ్యులు కోరిన నేపథ్యంలో ఆయన బుధవారం విజయవాడలోని వైఎస్సార్సీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనకు కోడెల మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని, ఆయన, నేను గత ఎన్నికల్లో సత్తెనపల్లిలో ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పుడు కోడెల తనపై 924 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనను, తన పార్టీనీ, కార్యకర్తలను, అభిమానులను కోడెల తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. ‘నాకు ఆయన రాజకీయ ప్రత్యర్థి, నన్ను ఆ విధంగానే భావించి వేధిస్తున్నారు. నా క్యాడర్‌ను పీఎస్‌కు పిలిపించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రౌడీషీట్‌లు పెడతామని బెదిరించారు. హిస్టరీ హిట్లు తెరిపిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా కోర్టుల్లో మేం వ్యాజ్యాలు నడుపుతున్నాం. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని మమ్మల్ని, మా క్యాడర్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం నా బాధ్యత’ అన్నారు. ‘గత ఎన్నికల్లో రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారని కోడెల స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పారు. అలాంటి వ్యక్తి క్రిమినల్ కాదా? 1999లో ఆయన ఇంట్లో బాంబులు పేలి నలుగురు చనిపోయారు. ఆ కేసుల్లో క్లీన్‌చిట్ ఇచ్చారని నిన్న అసెంబ్లీలో కొందరు చెప్పారు. అందులో వాస్తవం లేదు. కోడెలను క్రిమినల్ అని నిర్ధారణ చేసి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ కేంద్రాన్ని కోరింది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు సాయంతో కోడెల కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు. నన్ను అణచివేస్తే చూస్తూ ఊరుకోను, జైల్లో పెడితే కోడెల దుర్మార్గాలను మరింత బిగ్గరగా జైలు గోడలు బద్దలయ్యేలా వివరిస్తా. కోడెల అరాచకాలను నేను ప్రశ్నిస్తునే ఉంటా. కానీ, స్పీకర్ విధులకు సంబంధించి మాట్లాడను. శాసనసభ అంటే, స్పీకర్ అంటే ఎంతో గౌరవం ఉంది’ అని రాంబాబు వ్యాఖ్యానించారు.

ఇసుకలో దోచుకుంటున్నారు!

విజయవాడ, నవంబర్ 22: ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తున్నప్పటికీ, ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ప్రజలను కొంతమంది దోచుకుంటున్నారని పలువురు ఎమ్మెల్సీలు ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో బుధవారం నాటి ప్రశ్నోతరాల సమయంలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారా? అన్న ప్రశ్నపై సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఇసుకను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, గోదావరిలో రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలో దోపిడీ జరగుతోందని, ట్రాక్టర్ల యజమానులు బతికే పరిస్థితి లేదన్నారు. సభ్యుడు ఎ.అప్పారావు మాట్లాడుతూ చాలా ర్యాంప్‌లో ప్రభుత్వ ధరల పట్టిక వివరాలు ప్రదర్శించడం లేదని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక తరలింపునకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని సభ్యుడు రామసుబ్బారెడ్డి కోరారు. అన్నీ సక్రమంగా ఉన్నా, ఇతర జిల్లాలకు తరలిస్తుంటే వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దీనిపై రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు స్పందిస్తూ, 550 కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోతున్నా, ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని తెలిపారు. సామాన్యులకు భారం కాకూడదని, రీచ్‌లు కాని ప్రాంతం నుంచి ఇసుక తీసుకువెళ్తే ఆపేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.