ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నా ఆశ, శ్వాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 22: ‘పోలవరం నా ఆశ, నా శ్యాస, ప్రాజెక్టు పూర్తికావడం నా జీవిత లక్ష్యం. కేంద్ర సహకారం అందిస్తేనే అది సాధ్యం. 2019 కల్లా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తిచేసి తీరతాం అని పోలవరం ప్రాజెక్టు ఆర్‌ఆర్ ప్యాకేజీ కేంద్ర కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత రెండు రోజులు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించిన ఆర్‌ఆర్ ప్యాకేజీ కేంద్ర కమిటీ సభ్యులు లీనానాయర్, లతా కృష్ణారావు బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పరిహారంపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ముంపు గ్రామాల్లో తమ పర్యటన వివరాలను ముఖ్యమంత్రికి వెల్లడించారు. మొత్తం మూడు గ్రామాల్లో పర్యటించామని, నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గృహాలు బావున్నాయని చెప్పారు. ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ, పరిహారం, పునరావాసం వివరాలపై కేంద్రానికి త్వరలో నివేదిక ఇస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం జలవనరులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం పూర్తికాకుండా దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని, సమస్యలు సృష్టించడానికి, నిర్వాసితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడం మంచిది కాదన్నారు. గోదావరి నీటిని కావేరి వరకు తీసుకెళ్లే సత్తా తమకుందని, అయితే కావల్సిందల్లా కేంద్రం నుండి సహకారమని చెప్పారు. గోదావరి - పెన్నా - కావేరీ అనుసంధానానికి గల అవకాశాలపై తాము అధ్యయనం జరుపుతున్నట్టు తెలిపారు.
మరింత అధ్యయనం చేయండి
పోలవరం ప్రాజెక్టుపై సభ్యులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్వహించిన పార్టీ వ్యూహ సమీక్షలో పోలవరం గురించి మాట్లాడారు. పోలవరంపై మనం మాట్లాడుతున్న అంశాలను ప్రజలు బాగా అర్ధం చేసుకుంటున్నారని, అయితే దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు ప్రతి ఒక్క సభ్యుడికి నోట్ తయారుచేసి ఇవ్వాలని సూచించారు. పోలవరంపై మన వాదనలు నిజమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రతిపక్షం లేకపోవడంతో తొలి మూడురోజులు మీడియా కూడా అసెంబ్లీపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని, ఆ తర్వాత చర్చ అర్ధవంతంగా జరుగుతుండటం, మీరు కూడా బాగా మాట్లాడుతుండటంతో మీడియా కవరేజ్ కూడా బాగా వస్తోందన్నారు.