ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పసికందు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 23: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కాకినాడ నగరంలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గల మాతాశిశు విభాగంలో ఓ పసికందును గుర్తుతెలియని యువతి అపహరించింది. మాతా శిశు విభాగంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండగానే ఈ సంఘటన జరిగింది. పసికందు అపహరణతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తొండంగి మండలం హుకుంపేట గ్రామానికి చెందిన గంటా లక్ష్మి (22) అనే యువతి గురువారం ఉదయం 11 గంటల సమయంలో ప్రభుత్వాసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించిన పిమ్మట అదే విభాగంలోని రెండవ యూనిట్‌కు తల్లీబిడ్డలను తరలించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమారు ఇరవయ్యేళ్ళ వయస్సు గల యువతి పసిబిడ్డకు ఇంజక్షన్ చేయించాలని తల్లికి చెప్పి శివువును తీసుకువెళ్ళింది. గంటలు గడుస్తున్నా ఆ యువతి తిరిగి రాకపోవడంతో లక్ష్మి సహా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వైద్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతో కాకినాడ డిఎస్‌పి వర్మ, ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రావు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో సిసి పుటేజీలను పరిశీలించగా యువతి పసిబిడ్డను అపహరించి వెళ్తున్నట్టు గమనించారు. సదరు యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.