ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా సత్యసాయి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 23: పుట్టిపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సాయినామస్మరణతో పుట్టపర్తి మారుమోగింది. ప్రత్యేకంగా అలంకరించిన మహాసమాధిని పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాబా ప్రసంగాల అనువాదకుడు ప్రొఫెసర్ అనీల్‌కుమార్ సత్యసాయి అవతారం, లీలలను గురించి వివరించారు. సాయంత్రం స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతినిలయం ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జోలోత్సవం నిర్వహించారు.