ఆంధ్రప్రదేశ్‌

కీలక దశలో విజయవాడ మెట్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ మరో అడుగు ముందుకు వేసింది. విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందుకోసం కేంద్ర పెద్దలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మెట్రో ఫైలును ముందుకు నడిపించుకుంటూ వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు ఆమోద ముద్ర లభించాలంటే, అనేక మైలు రాళ్లను దాటాల్సి ఉంటుంది.
ఇందులో ప్రధానమైనది ప్రీ పబ్లిక్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు అనుమతి అవసరం. ఈ బోర్డులో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన అదికారులు ఉంటారు. మెట్రో బోర్డు సమర్పించిన ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ బోర్డు అడిగే ప్రతి ప్రశ్నకు మెట్రో అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ మెట్రో రైలు బోర్డు ఎండి రామకృష్ణారెడ్డి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంతో ప్రీ పిఐబి ఈ ఫైలును ఆమోదించింది. ఇప్పుడు ఈ ఫైలు పబ్లిక్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు (పిఐబి) వద్దకు రానుంది. పిఐబి దీన్ని లాంచనంగా ఆమోదిస్తుంది. ఆ తరువాత ఇది క్యాబినెట్‌కు వెళుతుంది. పిఐబి ఆమోదించిన ఫైలను క్యాబినెట్ లాంచంగా ఆమోదిస్తుంది.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా విజయవాడకు మెట్రో రైలు ఇవ్వాల్సి ఉన్నందున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే ఆమోదం తెలుపుతుంది. కేంద్రం మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి కావల్సిన లాంఛనాలు పూర్తి చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుకోవలసి వస్తుంది. వచ్చే ఆగస్ట్‌లో జైకా మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు రుణాన్ని మంజూరు చేయబోతోంది. దీంతో ఆగస్టు, లేదా సెప్టెంబర్‌లో విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నిడమానూరుకు 12.5 కిలో మీటర్ల కారిడార్‌ను, అలాగే రైల్వే స్టేషన్ నుంచి పెనమలూరుకు 13.5 కిలో మీటర్ల కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిసెంట్ రోడ్డకు కూడా మెట్రో కనెక్టివిటీ కావాలని కోరారు. దీనిపై మెట్రో రైలు బోర్డు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలా ఉండగా రామవరప్పాడు వద్ద మెట్రో రైలు వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడ భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాలేదు. మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యే నాటికి ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.