ఆంధ్రప్రదేశ్‌

సమస్యలకు భయపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 4: ఆకలిగా వుంటే ఆలోచనలు చేయడం కష్టతరమవుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమస్యల ద్వారానే అవకాశాలు పెరుగుతాయని, సమస్యలను చూసి భయపడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని, రాష్ట్రం మనం కోరుకోకుండా విడిపోయిందన్నారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా విజయవాడ ఏ కనె్వన్షన్ సెంటర్‌లో రెండేళ్లలో ప్రజలు, యంత్రాంగం సాధించిన విజయాలు, ఐదు గ్రిడ్లపై ఆ శాఖలకు సంబంధించిన అధికారులు, నిపుణులతో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో మనకు మంచి జరగలేదని, అందుకే సంబరాలు జరుపుకోకుండా నవనిర్మాణ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా కొంతమంది నాయకులు కొడతామనడం ఎంతవరకు సమంజసమన్నారు. దృఢసంకల్పంతో ముందుకుపోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలెండర్, నిత్యావసర సరుకులు, పెన్షన్లు ఎటువంటి అవినీతి జరుగకుండా నేరుగా లబ్దిదారునికి అందేలా టెక్నాలజీ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. మున్ముందు లబ్దిదారుడితో నేరుగా ఫోన్ ద్వారా తానే మాట్లాడతానని సమస్యలు తెలుసుకుంటానన్నారు. పేదల అభివృద్ధే తన లక్ష్యమని ప్రతి ఇంటికి తానే పెద్దకొడుకునన్నారు. ఒక అన్న, తమ్ముడు, కొడుకుగా అండగా వుంటానని తెలిపారు. తప్పు జరిగితే శిక్ష తప్పదని తన తెలివితేటలు, కష్టంతో పేద ప్రజలకు వెలుగులు నింపుతున్నట్లు పేర్కొన్నారు. మానసిక ఆనందం ఎంతో అవసరమని, డ్వాక్రా సంఘాలతో మహిళల్లో చైతన్యం ఏర్పడిందన్నారు. బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ చదువుకునేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వంటివారున్నారని వారిని వెలికితీయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలన్నారు. కరువు, తుఫాన్లు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయని, అయినప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖపట్నం ప్రథమ స్థానం కాగా కృష్ణాజిల్లా రెండో స్థానంలో వుందని, జిల్లాలన్నీ పోటీపడాల్సిన అవసరం వుందన్నారు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని ప్రపంచంలో రాయలసీమను ప్రథమ స్థానంలో వుండేవిధంగా అభివృద్ధి చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని పేదరికంపై గెలుపు సాధించాలన్నారు. పేదవారికి తానెప్పుడూ తోడుగా వుంటానని తన కులం పేదరికమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

chitram నవనిర్మాణదీక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఎం