ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చిక్కిన డిసిటివో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, మే 4: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వాణిజ్య పన్నుల కార్యాలయంపై ఏసిబి అధికారులు శనివారం సాయంత్రం దాడి చేయగా ఒక ఆటో మొబైల్ దుకాణం యజమాని నుంచి రూ 80వేలు లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. స్థానిక రైల్వేరోడ్డు సమీపంలోగల పరితోష ఆటోమొబైల్స్ యజమాని చైతన్య ఫిర్యాదు మేరకు నిఘా వేసి వుంచి ఏసిబి అధికారులు సంబంధిత వ్యక్తి నుంచి నగదు తీసుకొనే సమయంలో వలవేసి పట్టారు. కార్యాలయంలోనే ఒక టేబుల్ డస్క్‌లో రూ 16వేలు, మరో కంప్యూటర్ స్టాండ్ వద్ద రూ 14వేలు 10రూపాయిలు మొత్తంగా 30వేల 10రూపాయిలు లెక్కచూపని నగదు వుండగా దానిని కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో ఆ రెండుటేబుళ్ల వద్ద వున్న సిబ్బంది వున్న ఆ నగదును ఏసిబి అధికారులు దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని కిటికీల గుండా వెలుపలకి పడవేస్తుండగా గమనించిన ఏసిబి డి ఎస్పీ తోట ప్రభాకర్ అప్రమత్తమై స్వాధీనం చేసుకొన్నారు. కాగా వారు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. ఇటీవల డిసిటిఓ ఆడిటింగ్ అని చెబుతూ ఆ దుకాణంపై దాడిచేసి రికార్డులు స్వాధీనం చేసుకొన్నారు. పరిశీలించిన తర్వాత అందులో చాలా తప్పులు వున్నాయని తాము చట్టప్రకారం వ్యవహరిస్తే రూ 20 లక్షల వరకు అపరాధం వేయాల్సి వుంటుందని హెచ్చరించారు. ఈక్రమంలో తమ దుకాణంలో రికార్డుల పరంగా ఏ విధమైన తప్పులు లేవనే నమ్మకంతో యజమాని చైతన్య ఏసిబి అధికారులకు సమాచారం ఇచ్చి మరో వైపు కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో బేరం పెట్టాడు. 8లక్షల రూపాయిలు డిమాండ్ చేసిన సదరు డిసిటి ఓ మురళీకృష్ణ చివరికి రూ 80వేలు లంచంగా తీసుకొని రికార్డులు ఇవ్వడంతో పాటు క్లియిరెన్స్ సర్ట్ఫికేట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈనేపధ్యంలో శనివారం సాయంత్రం ఆరుగంటలకు ఆ సొమ్మును ఇచ్చేలా ఒప్పందం చేసుకోగా అదే సమయంలో ఏసిబి డి ఎస్పీ తోట ప్రభాకర్ తన సిబ్బందితో నిఘా వేసి వుంచి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఇదే కార్యాలయంపై ఏసిబి దాడి చేసి 4వేలు లంచం తీసుకొంటూ అప్పటి ఏసిటిఓ బాలాజీ సింగ్ దొరికి పోయిన సంగతి తెలిసిందే. పట్టుబడ్డ రామకృష్ణ నివాసాలను, వారి బంధువుల ఇళ్లను ఏసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు.