ఆంధ్రప్రదేశ్‌

అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో దోపిడీ దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను నెల్లూరు సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నెల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ ఈ ముఠా సభ్యుల అరెస్ట్, వారిపై నమోదైన కేసుల వివరాలను వివరించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన షఫీవుల్లా, పాముల శేఖర్, ముత్తుకూరుకు చెందిన షేక్ గౌస్‌బాషా, అత్తిపాటి వెంకటరమణ, షేక్ అబిద్, ఆమంచర్లకు చెందిన గంధవల్ల బాలాజీ, షేక్ ఇస్మాయిల్, షేక్ నూరుల్లా ముఠాగా ఏర్పడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల హత్యలు, చైన్‌స్నాచింగ్‌లు, దారి దోపిడీలకు పాల్పడేవారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సిసిఎస్ డిఎస్పీ శ్రీ్ధర్ పర్యవేక్షణలో ఏర్పడిన ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ ముఠాపై నిఘా పెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో దోపిడీలతో పాటు హత్యల్లోనూ వీరు పాల్గొన్నట్లు తేలింది. 2010లో కావలికి చెందిన విజయలక్ష్మి అనే మహిళను తమిళనాడు రాష్ట్రంలోని ఊతుకోట సమీపంలో హత్య చేశారు. అదేవిధంగా నాగేశ్వరరావు అనే డ్రైవర్‌ను కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో హత్య చేసి అతని ఇన్నోవాను దొంగిలించుకుపోయారు. ఈ రెండు హత్యల్లో షఫీవుల్లా, శేఖర్ ప్రధానపాత్ర పోషించారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం వద్ద డ్రైవర్‌ను కొట్టి స్విఫ్ట్ డిజైర్ కారును దొంగిలించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా ముదినేపల్లి తదితర ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాలో పలు నేరాలకు వీరు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.