ఆంధ్రప్రదేశ్‌

భవన వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 6: పట్టణ ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న భవన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొంతమేర వ్యర్థాలను తగ్గించుకోవాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. 10 లక్షల జనాభా దాటిన ప్రతి పట్టణంలోను భవన వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తొలిదశలో విశాఖపట్నం, రాజధాని అమరావతిలో రెండు ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ రెండు ప్రాంట్లను ఏర్పాటు చేయనున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్లాంట్‌లు భవన నిర్మాణ వ్యర్థాలను రీక్లైంగ్ చేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో తప్పనిసరిగా వ్యర్థాల నిర్వహణ పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన పరిశోధనలో చదరపు మీటరు వైశాల్యంలో నూతనంగా నిర్మించే భవన నిర్మాణాల నుంచి 40 నుంచి 60 కిలోల వ్యర్థాలు ఉత్పత్తవుతుండగా, ఛదరపు మీటరుకు 300 నుంచి 500 కిలోల వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయని తేల్చారు.