ఆంధ్రప్రదేశ్‌

సిఎంపై చంద్రగిరి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జూన్ 6: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదంటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా ఈనెల 9వ తేదీన రాష్టవ్య్రాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అయితే తాను మంగళవారం సింగపూర్‌కు వెళుతున్న కారణంగా 9వ తేదీన అందుబాటులో ఉండనని, అందుకే తాను ముందుగా ఫిర్యాదు చేస్తున్నట్లు చెవిరెడ్డి సోమవారం విలేఖర్లకు చెప్పారు. సిఐ శివప్రసాద్‌కు అందజేసిన ఫిర్యాదులోని అంశాలను ఈసందర్భంగా ఆయన వెల్లడించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు కాలేదని, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం, లేకుంటే రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నా హామీ అమలు కాలేదన్నారు. ఇంటికి 20 లీటర్ల మినరల్ వాటర్ హామీ, బెల్ట్‌షాపుల రద్దు కూడా అమలు కాలేదని చెప్పారు.