ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాల్లో ‘అంబుడ్స్‌మెన్’ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 6: రాజకీయాల్లో పెచ్చుమీరుతున్న దూషణల పర్వాన్ని నియంత్రించేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఖండించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ వాడని పదజాలాన్ని జగన్ వాడటం అతని నైజాన్ని బహిర్గతం చేసిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ విలువలను మరింత పతనం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఇలాంటి అభ్యంతరకర, చట్ట, రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వ్యవస్థ ప్రకారం ఐదుసార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులను ఈ రంగం నుండి పూర్తిగా నిషేధించాలని ఆయన సూచించారు. అలాగే ప్రతిపక్షం చేసే విమర్శల పట్ల అధికారపక్షం కూడా సంయమనం పాటించాలన్నారు.