ఆంధ్రప్రదేశ్‌

భావనపాడు పోర్టు ప్రాంతంలో భూ రిజిస్ట్రేషన్లపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 6: విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లూ కావడం లేదు. ఎవరికైనా రోగమో రొచ్చో వస్తే.. వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇదీ శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయనున్న తీరప్రాంత గ్రామాల ప్రజల దుస్థితి. పోర్టు నిర్మాణానికి ఆ ప్రాంత ప్రజలతో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి, భూసేకరణ ప్యాకేజీలు, ఉద్యోగ అవకాశాలపై భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఈ పోర్టు నిర్మాణం వల్ల తమ బతుకులు బాగుపడతాయని స్థానికులు కలలు కన్నారు. అయితే, అధికాల నిర్లక్ష్యం ఫలితంగా వారి కలలు కరిగిపోతున్నాయి. జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ పంచాయతీ పరిధిలో సూర్యమణిపురం, చీపురుపల్లి, దేవునల్తాడ గ్రామాలకు చెందిన 2200 ఎకరాల జిరాయితీ భూమిని భావనపాడు పోర్టు కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమిని సంతబొమ్మాళి మండల పరిధిలో సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, పోర్టు అవసరాలకన్నా ఎక్కువ భూమిని సేకరిస్తుండడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. పోర్టు నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూమిని అడ్డగోలుగా సేకరించి సర్కారే రియల్ వ్యాపారం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసింది. పనిలోపనిగా ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై నిషేధాజ్ఞలు ఇచ్చింది. దీంతో ప్రజల భూములను అవసరాలకు తాకట్టు పెట్టుకోలేక, అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ప్రభుత్వం భూసేకరణ తప్ప మరో మార్గంలో ఆ భూములకు ధర లేకుండా వ్యూహాన్ని పన్నింది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో సుమారు 1200 కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అత్యవసరాలకు సొంత భూమి ఉన్నా ప్రభుత్వ వైఖరి వల్ల పనికిరానిదిగా ఉంటుందని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం లేదా మరేదైన సొంత భూమిని విక్రయించి ఆర్థిక సమస్యలు తీర్చుకుందామంటే ఆ పరిస్థతి పోర్టు పరిసర గ్రామాలకు లేకుండాపోయింది.