ఆంధ్రప్రదేశ్‌

విజయానికి చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్ 4వతేదీన నిర్వహించే నౌకాదళ దినోత్సవం(నేవీ డే) విశాఖ ఆర్కేబీచ్‌లో సోమవారం సాయంత్రం వేడుకగా జరిగింది. తూర్పునౌకాదళం(ఇఎన్‌సీ) ప్రధానాధికారి కరమ్‌బీర్ సింగ్ ముఖ్య అతిధి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నౌకాదళ యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్లతో సైనికులు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. శత్రువుతో పోరాడే క్రమంలో భారత యుద్ధ నౌకలు చూపించే ధైర్య సాహసాలు, సముద్రంలోను, తీరంలోనూ దేశ విద్రోహులను తుదముట్టించే అంశాలు ఒళ్లు గగుర్పొడిచాయి. ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కమోర్తా, ఐఎన్‌ఎస్ కంజర్ తదితర యుద్ధనౌకలు అతిథులకు స్వాగతం పలికాయి. నౌకాదళంలోని శత్రువు సైన్యాన్ని చీల్చిచెండాడే హాక్స్, డార్నియర్ యుద్ధ విమానాలు, యుహెచ్ 3హెచ్, సీ కింగ్ 42, కమోవ్, చేతక్ హెలికాఫ్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశంలో కుట్రకు యత్నించిన ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో నౌకాదళం, మిలటరీ బలగాలు సంయుక్తంగా చేపట్టిన కౌంటర్ టెర్రరిజం దాడులు మన సైన్యం ధైర్య సాహసాలను కళ్లకు కట్టాయి. తీరంలోని ఆయిల్ రిగ్‌ను పేల్చివేసి, శత్రువు గుండెల్లో దడ పుట్టించిన సన్నివేశం ఎంతో ఉద్వేగాన్ని కల్పించింది. అరక్కోణం, ఐఎన్‌ఎస్ డేగా నుంచి యుద్ధ విమానాలు తీరంలో సందడి చేశాయి. వారాంతపు సెలవు లేకపోయినప్పటికీ వేల సంఖ్యలో సందర్శకులు నౌకాదళ దినోత్సవ వేడుకలను ఆద్యంతం ఆసక్తితో తిలకించారు.