ఆంధ్రప్రదేశ్‌

వచ్చేనెల 27 నుంచి నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు కనె్నర జేశారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడలో చేపట్టిన ‘కరెంటోళ్ల సమరభేరి’ దద్దరిల్లింది. ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యాన తలపెట్టిన ఆందోళనకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పని చేస్తున్న వేలాది మంది కార్మిక లోకం తరలివచ్చింది. డిమాండ్ల సాధన కోసం వచ్చే జనవరి 27వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఈ సభలో నిర్ణయించారు.
అంతకుముందు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి గాంధీనగర్, అలంకార్ సెంటర్ మీదుగా జింఖానా గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన నడుమ కార్మికులు కదంతొక్కారు. కార్మికులకు మద్దతుగా సీపీఎం, వైసీపీ, సీపీఐ నేతలు, ఏఐటీయుసి, సీఐటీయు, పలు విద్యుత్ కార్మిక, ఉద్యోగ యూనియన్లు ఆం దోళనలో పాల్గొన్నారు. జింఖానా గ్రౌండ్‌లో ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక చైర్మన్ పీ ఖాసీ మధుబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో పలు పార్టీల నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ప్రజలకూ, కార్మికులకూ చంద్రబాబు వాగ్దానాలు చేసి బాకీ పడ్డారని, వాటిని తీర్చాల్సిన బాధ్య త అయనపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు పేర్కొన్నారు.
కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ వారికి వేతనాల్విడంలో అలసత్వం ఏమిటని ప్రశ్నించారు. చంద్రన్న మాల్స్ పేరిట రిలయన్స్‌కు రూ. 8వేల కోట్ల వ్యాపారం అప్పగించి భవిష్యత్‌లో రేషన్ దుకాణాల మూసివేతకు ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి విల్సన్ మాట్లాడుతూ వచ్చే జనవరి 27 నుంచి విద్యుత్ కార్మికులు చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఓబులేసు మాట్లాడుతూ కరెంటోళ్లతో పెట్టుకుంటే కాలిపోతుందని ప్రభుత్వం గుర్తెరగాలని హెచ్చరించారు. సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ విద్యుత్ రంగానికి చెందిన ట్రాన్స్‌కో, డిస్క మ్, జెన్‌కోకు చెందిన 24వేల మంది కార్మికులు 15 ఏళ్ళుగా వెట్టిచాకిరీతో శ్రమదోపిడీకి గురువుతున్నారని అన్నారు. కాగా డిసెంబర్ 10 నుంచి 5వ తేదీ వరకు జిల్లా సదస్సులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. జనవరి 18వ తేదీ నుంచి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో రిలే నిరహారదీక్షలు, 24 నుంచి విజయవాడ కేంద్రంగా నిరవధిక నిరాహారదీక్షలు, 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెలోకి వెళ్లాలని ఉద్య మ కార్యాచరణ ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని, సమాన పనికి సమాన వేతనమివ్వాలని, మరణించిన కుటంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, సంస్థలో ఉద్యోగమివ్వాలని, సర్వీసు ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

చిత్రం..విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రదర్శన