ఆంధ్రప్రదేశ్‌

ఇదిగో.. డిఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2018 షెడ్యూల్ విడుదల 12,370 టీచర్ పోస్టుల భర్తీ 15న నోటిఫికేషన్
26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మార్చి 23 నుంచి పరీక్షలు

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డిఎస్సీ) 2018 నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పోస్టింగ్‌లు ఇచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించింది. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ 2018 షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ సెంటర్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం రూ.23,209 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోందన్నారు. కేవలం పాఠశాలలు, కళాశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ.5 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతోందన్నారు. డిఎస్సీ 2018 ద్వారా 12,370 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 10,313, మోడల్ పాఠశాలల్లో 1,197, స్పెషల్ ఎడ్యూకేటర్‌కు సంబంధించిన 860 పోస్టులు ఉన్నాయన్నారు. 10,313 పోస్టులకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపిందని, మిగిలిన పోస్టులకు క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. డిఎస్సీ రాత పరీక్ష మాత్రం 12,370 పోస్టులకు సంబంధించే జరుగుతుందన్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్‌లో జంబ్లిగ్ విధానం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం మొదటి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపునకు ప్రభుత్వం ముందుకొచ్చిందని తాను ప్రకటించానని, ఆ విషయం తెలుసుకోకుండా జగన్ నిర్లక్ష్యంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ.82 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా జీతాలు చెల్లిస్తామన్నారు. కడప జిల్లాలో నవ వధువుపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డిని విధుల నుంచి తొలగించినట్లు మంత్రి గంటా తెలిపారు. పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంటర్ విద్యా కమిషనర్ ఉదయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డిఎస్సీ) 2018 షెడ్యూల్ వివరాలు:
డిసెంబర్ 15, 2017న నోటిఫికేషన్ జారీ. డిసెంబర్ 26, 2017 నుంచి ఫిబ్రవరి 8, 2018 వరకు (45 రోజుల పాటు... ఆన్‌లైన్ ద్వారా) దరఖాస్తుల స్వీకరణ. మార్చి 9 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షల నిర్వహణ. ఏప్రిల్ 9న ప్రారంభ కీ విడుదల. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు ఆరు రోజుల పాటు కీపై అభ్యంతరాల స్వీకరణ. ఏప్రిల్ 30న ఫైనల్ కీ విడుదల. మే 5న మెరిట్ లిస్టు ప్రకటన. మే 11న అభ్యర్థులకు సమాచారం అందచేత. మే 14 నుంచి 19 వరకు ఒరిజినల్ సర్ట్ఫికెట్ల పరిశీలన. జూన్ 1 నుంచి 6 వరకు ఫైనల్ సెలక్షన్ జాబితా. జూన్ 8నుంచి 11 వరకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు