ఆంధ్రప్రదేశ్‌

త్వరలో మత్స్య విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలో వీలైనంత త్వరలో మత్స్య విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసేలా చర్యలు ప్రారంభించినట్లు మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్ గ్రూప్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. చైనా అకాడమీకి చెందిన జియాన్ విశ్వవిద్యాలయం సహకారం ఎలా ఉండాలి.. ఆనంద్ గ్రూప్ ఏమేమి చేయాలి.. ప్రభుత్వం తన పరంగా ఏం చేయాలనే అంశాలపై మంత్రి గురువారం విజయవాడలో చైనా ప్రతినిధులు, ఆనంద్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చైనాకు చెందిన జియాన్ విశ్వవిద్యాలయం పనితీరును మంత్రికి వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చైనా విశ్వవిద్యాలయం మంచినీటిలో 100కి పైగా మేలైన మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కాలుష్య రహిత వాతావరణంలో అధిక ఉత్పత్తి సాధించేలా ఆ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటుకానున్న మత్స్య విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక్కడి విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇక్కడ రెండేళ్లు విద్యనభ్యసించాక మిగిలిన సంవత్సరాలు చైనాలో అభ్యసించడానికి వీలు కల్పిస్తున్నారు. అలాగే పరిశోధక విద్యార్థులు కూడా ఇక్కడా, అక్కడా పరిశోధనలు చేయడానికి వెసులుబాటు కల్పిస్తారు.